సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా రజనీకాంత్ స్టార్‌డమ్, స్టైల్, తెరపై ఆయనకున్న ప్రత్యేకమైన ఆకర్షణకు నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉందని పేర్కొన్నారు. రజనీకాంత్ తనదైన శైలిలో మరోసారి ప్రేక్షకులను అలరించారని అల్లు అర్జున్ ప్రశంసించారు.
24
అనిరుధ్ సంగీతంపై ప్రత్యేక ప్రశంసలు
ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాత్రను కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనిరుధ్ అద్భుతంగా పనిచేశారని ప్రశంసిస్తూ, సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత సన్ పిక్చర్స్ సంస్థ తమ పూర్తి శ్రమను, మనసును పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారని పేర్కొన్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మరోసారి తనదైన శైలిలో అద్భుతమైన విజయాన్ని అందించారని అభినందించారు.
34
చొక్కా నలగకుండా రూ.500 కోట్లు కొట్టడం రజనీకాంత్‌కే సాధ్యం
అల్లు అర్జున్ తన పోస్టులో రజనీకాంత్ స్టైల్‌ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్య ప్రత్యేకంగా ఆకట్టుకుంది. “చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజనీకాంత్ గారికే సాధ్యం” అని పేర్కొన్నారు. రజనీకాంత్ తెరపై కనిపించే ప్రత్యేకమైన స్టైల్, ఆయనకున్న స్టార్‌డమ్‌ను ఈ మాటలతో అల్లు అర్జున్ సరదాగా ప్రశంసించారు. చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ, దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ సహా ఈ సినిమా కోసం పనిచేసిన వారందరినీ కొనియాడారు.
#Jailer2 is 🔥🔥🔥
A true showcase of @rajinikanth sir’s star power, swag & aura! A Commercial Entertainer that keeps the adrenaline pumping!
Brother... @anirudhofficial KILLED IT! All the artists, technicians & the producer have poured their hearts into this film. The Showman @Nelsondilpkumar garu delivers the coolest hit with a BANG!
చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం! 🖤
అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘జైలర్ 2’ చిత్రాన్ని నిర్మించిన సంస్థతోనే అల్లు అర్జున్ తన తదుపరి సినిమా చేస్తుండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.