Allu Arjun Political Entry: రాజకియాల్లోకి అల్లు అర్జున్? సీక్రెట్‌గా బ్యాక్‌ గ్రౌండ్‌ వర్క్.. బన్నీ టీమ్‌ రియాక్షన్‌ ఏంటంటే?

Published : Jul 11, 2026, 11:41 AM IST

Allu Arjun Political Entry : పుష్ప లాంటి సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఎదిగాడు అల్లు అర్జున్. నటనతో, డ్యాన్స్‌తో 'ఐకాన్ స్టార్'గా ఎదిగిన ఈ హీరో.. త్వరలో రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారా? జోరుగా వస్తున్న వార్తల్లో నిజం ఎంత? 

PREV
16
పాన్ ఇండియ సినిమాలతో బిజీగా..

వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ.. బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. అట్లీతో రాకా మూవీ చేస్తున్న బన్నీ.. ఈసినిమాతో 2 వేల కోట్లకు పైగా కలెక్షన్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈమూవీ తరువాత లోకేష్ కనకరాజ్ తో మరో మూవీ ప్లాన్ చేశాడు ఐకాన్ స్టార్.. ఇలా వరుసగా పాన్ ఇండియా మూవీస్ ను కమిట్ అవుతూ వస్తున్న అల్లు అర్జున్.. ఫ్యూచర్ లో రాజకీయ రంగ ప్రవేశానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కొన్నేళ్ళ తరువాత ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని, అందుకే ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడని అంటున్నారు.

26
అభిమాన సంఘాలతో సైలెంట్ ఆపరేషన్?

ఇటీవల కాలంలో అల్లు అర్జున్ తన అభిమాన సంఘాల (Allu Arjun Fans Associations) బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కేవలం సినిమాల ప్రమోషన్లకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని అభిమాన సఘాల ప్రెసిడెంట్లకు ఇంటర్నల్ గా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. విజయ్ తన 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' ద్వారా క్షేత్రస్థాయిలో ఎలాంటి పునాది వేసుకున్నారో.. అల్లు అర్జున్ సైతం తన ఆర్మీ (Allu Arjun Army) ద్వారా అదే తరహా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

36
సొంతంగానా? లేక సపోర్ట్ ఇస్తారా?

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే సొంత పార్టీ పెడతారా లేక ఇప్పటికే ఉన్న ఏదైనా పార్టీకి సపోర్ట్  ఇస్తారా అనే దానిపై స్పష్టత లేదు. అయితే, గత ఎన్నికల సమయంలో ఆయన కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సపోర్ట్ చేసి ఇలా ప్రకటించడం ద్వారా తనకున్న రాజకీయ ఆసక్తులను పరోక్షంగా బయటపెట్టారు. ఇప్పుడు ఆ అడుగులను మరింత ముందుకు వేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా తనకున్న అభిమాన సంఘాలను ను ఒక వ్యవస్థీకృత శక్తిగా మార్చేందుకు తెరవెనుక చర్చలు జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

46
భారీ ఇమేజ్.. బలమైన వ్యూహం

అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశంపై పక్కా ప్లాన్ తో వెళ్ళబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆయన ద్వారా పనులు చక్కబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు విజయ్ దళపతి, జగన్ మాదిరిగా రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సలహాలతో అల్లు అర్జున్ ముందుకు వెళ్లబోతున్నట్టు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆయన ముంబయ్ లో ప్రశాంత్ కిషోర్ ను కలిసి చర్చలు జరిపినట్టు కూడా న్యూస్ బయటకు వచ్చింది. కానీ ఈ విషయాలు ఏవీ అధికారికంగా ప్రకటించలేదు.

56
ఎంట్రీ ఎప్పుడు ఉండే అకాశం ఉంది?

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌కు యువతలో ఉన్న క్రేజ్ అపారం. ఆ క్రేజ్‌ను కేవలం బాక్సాఫీస్ వసూళ్లకే కాకుండా, రాజకీయ అస్త్రంగా మార్చుకుంటే తిరుగుండదని ఆయన సన్నిహితులు భావిస్తున్నారట. సినిమా ఇమేజ్ వేరు, రాజకీయం వేరు అనే విషయాన్ని గుర్తించిన ఐకాన్ స్టార్.. ఎక్కడా తొందరపడకుండా, పక్కా ప్లానింగ్‌తో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 8 ఏళ్ళ తరువాత ఆయన డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారని.. అప్పటి వరకూ బలమైప పునాది వేసుకుంటూ వెళ్తారని టాక్ వినిపిస్తోంది.

66
స్పందించిన అల్లు అర్జున్ టీమ్..

అయితే పొలిటికల్ ఎంట్రీ వార్తలపై అల్లు అర్జున్ పీఆర్ టీం స్పందించింది. అల్లు అర్జున్ కి వ్యక్తిగత మ్యానేజర్ గా పని చేస్తున్న శరత్ చంద్ర మాట్లాడుతూ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు’ అంటూ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. ఒకవైపు 2034 ను టార్గెట్ గా చేసుకుని అల్లు అర్జున్ సినిమాలు త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారంటు వార్తులు గుప్పుమంటుంటే.. బన్నీ టీమ్ మాత్రం ఈ విధంగా చెప్పడంతో అభిమానులు కన్ ఫ్యూజన్ లో పడ్డారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ స్వయంగా చెప్పే వరకూ ఈ వార్తలను నమ్మడానికి లేదు. ఏమో ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఇప్పటికి మాత్రం అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ.. సోషల్ మీడియా రూమర్ గానే మిగిలిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories