Lenin Day 1 Collections: లెనిన్‌ మూవీ ఫస్ట్ డే వసూళ్లు, బాక్సాఫీసు వద్ద అఖిల్‌ ర్యాంపేజ్‌.. హిట్‌ టార్గెట్‌ ఎంతంటే?

Published : Jul 11, 2026, 09:25 AM IST

అఖిల్‌ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన `లెనిన్‌` మూవీ శుక్రవారం విడుదలై థియేటర్లో సందడి చేస్తోంది. పాజిటివ్‌ టాక్‌ని రాబట్టుకుంటున్న ఈ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే.. 

PREV
14
భారీ అంచనాలతో వచ్చిన అఖిల్‌ `లెనిన్‌`

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `లెనిన్‌`. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలతో ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. కథగా కొంత రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీగా ఉందనే కామెంట్‌ ఉన్నా, యాక్షన్‌, సెంటిమెంట్‌, ఎమోషన్స్ మాస్‌ ఆడియెన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుందనే టాక్‌ ఉంది.

24
లెనిన్‌ మూవీ మొదటి రోజు కలెక్షన్లు

`లెనిన్‌` మూవీ బాక్సాఫీసు వద్ద మాత్రం మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. అఖిల్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని సాధించడం విశేషం. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.9.73కోట్లు(సాక్నిల్క్ సైట్‌ లెక్కల ప్రకారం) వసూలు చేసింది. ఇండియాలో  రూ.6.73కోట్ల గ్రాస్‌, రూ.5.90కోట్ల నెట్‌ రాబట్టింది. ఎవర్సీస్‌లో అదిరిపోయే వసూళ్లని కలెక్ట్ చేసింది. అక్కడ దీనికి ఏకంగా రూ.3కోట్లు వచ్చాయి. మొత్తంగా మొదటి రోజు అఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది `లెనిన్‌`.

34
అఖిల్‌ కెరీర్‌లో హైయ్యెస్ట్ కలెక్షన్లు

అఖిల్‌ నటించిన గత చిత్రం `ఏజెంట్‌` మొదటి రోజు సుమారు ఏడు కోట్లు రాబట్టింది. దాన్ని `లెనిన్‌` బ్రేక్‌ చేసింది. ఇది ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ కి ఒక సాంకేతం, మూవీ విజయానికి ఒక సాంకేతంగా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇదే జోరు శనివారం, ఆదివారం కూడా చూపిస్తుందా అనేది చూడాలి. ఇప్పటి వరకు బుకింగ్స్ పరంగా సాలిడ్‌గానే ఉంది. ఈ రెండు రోజులు వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి వచ్చే ఆదరణ బట్టి ఈ మూవీ విజయం ఆధారపడి ఉంటుంది.

44
లెనిన్‌ మూవీ బడ్జెట్‌, బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`లెనిన్‌` సినిమాకి అయిన బడ్జెట్‌ సుమారు రూ.40కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్.. ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్  జీ తెలుగు వాళ్లు తీసుకున్నారు.  దీని రూపంలో దాదాపు 30శాతం రికవరీ అయ్యిందట. ఇక థియేట్రికల్‌ బిజినెస్‌ చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు నాగవంశీ, నాగార్జున సొంతంగానే రిలీజ్‌ చేశారని తెలుస్తోంది. థియేట్రికల్‌గా దీనికి రూ.25కోట్లుగా లెక్కకట్టారు. ఇక కర్నాటకలో రూ.8కోట్లు, ఇతర రాష్ట్రాలు కలిపి మరో రెండు కోట్లకు అమ్మారట. ఓవర్సీస్‌ మొత్తంగా మరో పది కోట్లకు అమ్మినట్టు సమాచారం. మొత్తంగా ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.45కోట్ల షేర్‌ రావాలి. అంటే రూ.90కోట్లకుపైగా గ్రాస్‌ వసూలు చేయాలి. మరి లాంగ్‌ రన్‌లో ఎంత వరకు రాబడుతుందో చూడాలి. అయితే టీమ్‌ మాత్రం అఖిల్‌కి తొలి హిట్‌ పడినట్టే అని భావిస్తుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories