అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమా ఫైనల్‌.. ఆ స్టార్‌ డైరెక్టర్‌కే కమిటైన ఐకాన్‌ స్టార్‌.. వాళ్లంతా సైడేనా?

Published : Dec 06, 2022, 06:57 PM IST

ఐకాన్‌ స్టార్‌ గత రెండేళ్లుగా `పుష్ప` సినిమాకే పరిమితం అయ్యాడు. ఆయన నెక్ట్స్ మూవీపై ఓ క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాడు బన్నీ. ఆ స్టార్‌ డైరెక్టర్‌తోనే మరోసారి సినిమా చేయబోతున్నారని టాక్‌. 

PREV
15
అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమా ఫైనల్‌.. ఆ స్టార్‌ డైరెక్టర్‌కే కమిటైన ఐకాన్‌ స్టార్‌.. వాళ్లంతా సైడేనా?

అల్లు అర్జున్‌(Allu Arjun) ప్రస్తుతం `పుష్ప2`(Pushpa2)లో నటిస్తున్నారు. గతేడాది వచ్చిన `పుష్ప`కిది రెండో భాగం. ఇప్పుడు ఇది చిత్రీకరణ దశలో ఉంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `ఆర్య`, `ఆర్య2` తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. 
 

25

అయితే బన్నీ `పుష్ప` తర్వాత ఎవరితో చేస్తాడనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వరకు స్టార్‌ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్‌ నుంచి సంజయ్‌ లీలా భన్సాలీ, కోలీవుడ్‌ నుంచి అట్లీ, ఏఆర్‌ మురుగదాస్‌, తెలుగులో, బోయపాటి శ్రీను వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే కొరటాల శివతోనూ సినిమా ఉన్న విషయం తెలిసిందే. 

35

కానీ తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. బన్నీ నెక్ట్స్ చేయబోయేది స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌(Trivikram) తోనే అని తెలుస్తుంది. మాటల మాంత్రికుడితోనే సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నారట. అంతేకాదు బయట బ్యానర్‌లో కాకుండా గీతా ఆర్ట్స్ లోనే ఈ సినిమా చేయాలనుకుంటున్నారట. `పుష్ప`కి ముందు వీరి కాంబినేషన్‌లో `అలా వైకుంఠపురములో` వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో మురుగదాస్‌, అట్లీ వంటి పేర్లు కూడా క్యూ లో ఉన్నాయి. మరి త్రివిక్రమ్‌ సినిమా తర్వాత మురుగదాస్‌తో చేస్తాడా? లేక అట్లీతో ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

45

ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది. నెక్ట్స్ షెడ్యూల్‌ ఈ నెలలోనే ప్లాన్‌ చేస్తున్నారట. మహేష్‌ వరుసగా అన్న, అమ్మ, నాన్నని కోల్పోవడంతో తీరని బాధలో ఉన్నారు. ఆ బాధ నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొనడానికి కొంత టైమ్‌ పట్టేలా ఉంది. అయితే ఇటీవలే ఆయన యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు. దీంతో త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు పెద్దగా టైమ్‌ పట్టకపోవచ్చు. అందుకే ఈ నెలలోనే షూటింగ్‌ స్టార్ట్ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.

55

మహేష్‌ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ ఎవరితో చేస్తారనేది క్లారిటీ లేదు. ఎన్టీఆర్‌ ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అయితే తారక్‌ నెక్ట్స్ ప్రశాంత్‌ నీల్‌తో కమిట్‌ మెంట్‌ ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌ తన తదుపరి సినిమా బన్నీతోనే చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ లెక్కన బన్నీ నెక్ట్స్ త్రివిక్రమ్‌తోనే అనేది ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అనే వార్తలు అటు ఫిల్మ్ నగర్‌లోనూ, ఇటు సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories