Allu Arjun: అల్లు అర్జున్‌ నయా లుక్‌ అదిరిపోయిందిగా.. చెవికి పోగులు, సైడ్‌ కట్టింగులతో రచ్చ రచ్చ..

Published : Jul 29, 2022, 09:01 PM IST

ఐకాన్‌ స్టార్‌ స్టయిల్‌ కా బాప్‌ అనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన స్టయిల్‌తోనే నార్త్, సౌత్‌ అనే తేడా లేకుండా ఇండియా వైడ్‌గా క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు చెవి పోగులతో రచ్చ చేస్తున్నారు.   

PREV
17
Allu Arjun: అల్లు అర్జున్‌ నయా లుక్‌ అదిరిపోయిందిగా.. చెవికి పోగులు, సైడ్‌ కట్టింగులతో రచ్చ రచ్చ..

స్టయిలీష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ప్రమోట్‌ అయిన అల్లు అర్జున్‌(Allu Arjun) `పుష్ప`(Pushpa) సినిమాతో దేశ వ్యాప్తంగా సత్తా చాటారు. ఈ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇందులోని బన్నీ డైలాగ్ లు, మ్యానరిజం అనేక మంది ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. రీల్స్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికీ బన్నీ మ్యానరిజంతో కూడిన వీడియోలు ఇంటర్నెట్లో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. 
 

27

ఇది మరువక ముందే మరో డిఫరెంట్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నారు అల్లు అర్జున్‌. సాల్ట్ పెప్పర్‌ లుక్‌లోకి లోకి మారిపోయి షాకిస్తున్నారు. స్టయిల్‌కి బాప్‌ అనిపించే బన్నీ ఈ నయా లుక్‌ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నోట్లో బీడీ కట్ట, నెరిసిన వైట్‌ జుట్టు, డిఫరెంట్‌ సైడ్‌ హెయిర్‌ కట్టింగ్‌లతో సరికొత్తగా కనిపిస్తున్నారు. Allu Arjun New Look.
 

37

తాజాగా ఈ నయా లుక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనం క్రియేట్‌ చేస్తుంది. ఐకాన్‌ స్టార్‌ కొత్త లుక్‌ దుమ్మురేపుతుంది. ఇంటర్నెట్‌లో రచ్చ రచ్చ చేస్తుంది. బన్నీ ఫ్యాన్స్ ఈ లుక్‌ని చూసి ఉగిపోతుండటం విశేషం. అయితే ఇది సినిమా లుక్‌ కాదు, ఓ యాడ్‌ లుక్‌ కావడం విశేషం.

47

బన్నీ `పుష్ప2`కి వచ్చిన గ్యాప్‌తో ఖాళీగానే ఉన్నారు. ఈ గ్యాప్‌లో యాడ్స్ తో బిజీగా గడుపుతున్నారు. యాడ్స్ చేస్తూ అలరిస్తున్నారు. మొన్ననే త్రివిక్రమ్‌తో ఓ యాడ్‌ చేసిన అల్లు అర్జున్‌ ఇప్పుడు మరో యాడ్‌ చేశారు. 

57

తాజాగా హరీష్‌ శంకర్‌తో మరో యాడ్‌ చేశారు. `ఆస్ట్రాల్‌ పైప్స్` అనే సంస్థ కోసం చేసిన యాడ్‌లో తాజాగా బన్నీ నటించారు. దీనికోసం ఈ నయా లుక్‌లోకి మారిపోయారు. హరీష్‌ శంకర్‌ ఈ యాడ్‌ డైరెక్ట్ చేయగా, బన్నీ నయా ట్రాన్ఫ్సర్మేషన్‌తో అదరగొడుతున్నారు. జస్ట్ లుక్కే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక యాడ్‌లో ఆయన అప్పియరెన్స్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్‌ ఈ కొత్త లుక్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది.

67

అల్లు అర్జున్ చివరగా `పుష్ప` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. మొదట డివైడ్‌ టాక్‌ వచ్చినా, నెమ్మదిగా పుంజుకుంది. సంచలనంగా మారింది. హిందీ వెర్షన్‌లోనే దాదాపుగా వంద కోట్లు వసూలు చేసింది. అటు బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలకే కాదు, చిత్ర యూనిట్‌కి సైతం షాకిచ్చింది. 
 

77

ఇప్పుడు `పుష్ప`కి సీక్వెల్‌లో నటిస్తున్నారు బన్నీ. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ రెండో భాగంగా ఇంకా ప్రారంభం కాలేదు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. తొలి పార్ట్ భారీ విజయం సాధించడంతో భారీ అంచనాలున్నాయి. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌`లతో పోల్చుతున్నారు. దీంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సుకుమార్‌ స్క్రిప్ట్ కి మరింత మెరుగులు దిద్దుతున్నారు. లార్జ్ స్కేల్క్‌ లో రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి మూడో పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories