అల్లుఅర్జున్, సచిన్ టెండూల్కర్‌తో సమానం... ఆయన ‘క్రికెట్ దేవుడు’ అయితే, బన్నీ...

First Published May 9, 2021, 12:59 PM IST

అల్లు అర్జున్... ‘పుష్ఫ’ టీజర్ విడుదలైన తర్వాత మనోడి గురించి చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నిర్మాత ‘దిల్‌రాజు’... బన్నీకి ‘ఐకాన్ స్టార్’ అని ఎవ్వరూ ఇవ్వలేదని, ఆయనే పెట్టుకున్నాడని చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు అల్లు అర్జున్...

చాలామంది హీరోలతో పోలిస్తే అల్లుఅర్జున్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ‘గంగోత్రి’ సినిమాకి, ఇప్పుడు చూస్తున్న బన్నీకి తేడా గమనిస్తే, అల్లువారబ్బాయి ఎంత మారిపోయాడో క్లియర్‌గా తెలుస్తుంది...
undefined
‘గంగోత్రి’ సినిమాలో హీరోగా పరిచయం అయినప్పుడు ‘వీడు హీరోనా? ఇలా ఉన్నాడేంటి?’ అని ట్రోల్ చేసిన వాళ్లతోనే ‘హీరో అంటే ఇలా ఉండాలిరా’ అని పొడిగించుకున్నాడు అల్లుఅర్జున్... అతని మేకోవర్‌లో వచ్చిన తేడా అలాంటిది.
undefined
అయితే అల్లుఅర్జున్‌కి ఏకంగా ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ కామెంట్ చేశాడు కమేడియన్ మధునందన్. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నితిన్ స్నేహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు మధునందన్...
undefined
అయితే అల్లుఅర్జున్‌కి ఏకంగా ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ కామెంట్ చేశాడు కమేడియన్ మధునందన్. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నితిన్ స్నేహితుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు మధునందన్...
undefined
‘నువ్వు నేను’ సినిమా నుంచే ఎంట్రీ ఇచ్చినా ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘దొంగాట’, ‘అ ఆ’, ‘ఛల్ మోహనరంగ’, ‘టాక్సీవాలా’, ‘ఓరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాలు మధునందన్‌కి కమేడియన్‌గా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
undefined
అల్లుఅర్జున్‌తో కలిసి ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో పనిచేసిన రఘునందన్... బన్నీ గురించి ఒక్క మాటలో చెప్పండని అడిగిన ప్రశ్నకి ఏకంగా సచిన్‌తో పోల్చాడు...
undefined
‘సచిన్ టెండూల్కర్‌కి మనం క్రికెట్‌గాడ్‌కి పిలుస్తాం. బన్నీ కూడా సచిన్‌తో సమానమే. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌‌ను ఎలాంటి మార్పులు తెచ్చాడో, హర్డ్ వర్క్ విషయంలో బన్నీ కూడా అంతే కృషి చేశాడు...
undefined
అల్లు అర్జున్ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఓ నటుడు ఎలా ఉండాలంటే నాకు తెలిసి బన్నీలాగే ఉండాలి. అతను మోస్ట్ హార్ట్ వర్కింగ్ పర్సన్... నాలాంటి ఎంతో మందికి ఆదర్శం’ అంటూ చెప్పుకొచ్చాడు మధునందన్...
undefined
అల్లుఅర్జున్ కష్టపడతాడనే విషయాన్ని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలి, వందల కోట్ల మంది అభిమానులతో దేవుడిగా కోలవబడిన సచిన్ టెండూల్కర్‌తో పోల్చడమే తీవ్ర వివాదాస్పదమైంది.
undefined
అవకాశాలు కావాలంటే హీరోని పొగడాలి, స్టార్ హీరో దృష్టిలో పడాలంటే కొన్ని కోతలు కోయాలి... కానీ అవకాశం దొరికిందని ఇలా ఎవరితో పడితే, వారితో పోలిస్తే అది పొగిడినట్టు కాకుండా, హీరోని ట్రోల్ చేసినట్టు ఉంటుందని అంటున్నారు అభిమానులు...
undefined
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ‘స్టైలిష్ స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లుఅర్జున్. సౌత్ ఇండియాలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన హీరోగానూ నిలిచాడు.
undefined
ఎన్ని చేసినా, ఎంత ఎదిగినా అల్లుఅర్జున్‌ని, మెగాస్టార్‌తో పోల్చలేం. అలాగే మెగాస్టార్‌ని, సచిన్ టెండూల్కర్‌తో పోల్చలేం. అవకాశాలు కావాలంటే అడగాలి, కానీ ఇలా అర్థం లేని మాటలు మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నారు సచిన్ వీరాభిమానులు.
undefined
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ఫ’ సినిమా చేస్తున్నాడు అల్లుఅర్జున్. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ఫ’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆలోచిస్తోంది మూవీ యూనిట్...
undefined
ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ మూవీ ఉంటాయని టాక్. అయితే మధ్యలో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఉంటుందని ప్రచారం నడుస్తోంది...
undefined
click me!