దేశం మొత్తం చూస్తుంది, ఆ పాత్ర చేసిన వాడు అదృష్టవంతుడు అంటూ బన్నీ కామెంట్స్.. కానీ పరిస్థితి తిరగబడింది

Published : Jul 31, 2024, 09:56 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. ఈ ఏడాది రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగాన్ని తెరకెక్కిస్తున్నారు.

PREV
16
దేశం మొత్తం చూస్తుంది, ఆ పాత్ర చేసిన వాడు అదృష్టవంతుడు అంటూ బన్నీ కామెంట్స్.. కానీ పరిస్థితి తిరగబడింది
Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. ఈ ఏడాది రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో మొదటి భాగాన్ని మించేలా రెండవ భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే పుష్ప 2 చిత్రం ఆలస్యం అవుతుండడం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. 

26

ఇదిలా ఉండగా పుష్ప 2లో అందరిలో ఉత్కంఠ రేపుతున్న మరో పాత్ర నటుడు జగదీశ్ పోషించిన కేశవ పాత్ర. కేశవ పాత్రకి ఇండియా మొత్తం గుర్తింపు లభించింది. పుష్ప కి ముందు కేశవ నటుడు అని చాలా తక్కువ మందికి తెలుసు. పుష్ప చిత్రంలో ఎప్పుడూ హీరో పక్కనే ఉండే పాత్ర దొరకడంతో అతడికి ఇండియా మొత్తం గుర్తింపు లభించింది. 

36
Allu Arjun

పుష్ప రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ జగదీశ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరోజు జగదీశ్ తో కూర్చుని ఓ మాట చెప్పారట. ప్రారంభంలోనే ఒక నటుడికి ఇంత పెద్ద పాత్ర రాదు. పుష్ప కథ విన్నప్పుడే నేను అనుకున్నా.. ఈ పాత్ర ఎవరు చేస్తే వాళ్ళు అదృష్టవంతులు అని. 

46

అంతకు ముందు జగదీశ్ తనకి సరైన పాత్రలు రావడం లేదని, పెళ్లి కావడం లేదని బాధపడ్డాడట. బాధపడకు సినిమా రిలీజ్ తర్వాత యావత్ దేశం నిన్ను గుర్తిస్తుంది. నీ రేంజ్ మారిపోతుంది అని బన్నీ చెప్పాడు. 

56

జగదీశ్ కి గుర్తింపు అయితే వచ్చింది కానీ అతడి జీవితం ఊహించని విధంగా తలక్రిందులు అయింది. ఒక మహిళ ఆత్మహత్య కేసులో జగదీశ్ చిక్కుకుని జైలుకి వెళ్ళాడు. ఎలాగోలా బెయిల్ పై బయటకి వచ్చి పుష్ప 2 చేస్తున్నాడు. 

66

మరి పుష్ప 2 తర్వాత జగదీశ్ పరిస్థితి ఎలా మారనుందో.. ఆ కేసు నుంచి బయటపడతాడో లేదో చూడాలి. పుష్ప 2లో అతడి పాత్రపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అల్లు అర్జున్ పక్కనే ఉంటూ అతడికే వెన్నుపోటు పొడుస్తాడని ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories