సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రేక్షకులతో సక్సెస్ ని పంచుకుంటున్నారు. రీసెంట్ గా భీమవరంలో సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఎక్కడికి వెళ్లినా వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హైలైట్ అవుతున్నారు. బుల్లిరాజు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అయితే సంక్రాంతికి వస్తున్నాం చిత్ర సక్సెస్ ఈవెంట్స్ లో నరేష్ మిస్ అవుతున్నారు. అసలు ఆయన ప్రచార కార్యక్రమాలకు, ఈ చిత్రానికి దూరంగా ఉంటున్నారు.