ఎన్టీఆర్‌కి జరిగిందే.. అల్లు అర్జున్‌ `ఐకాన్‌స్టార్‌` విషయంలో జరుగుతుందా?.. ఫ్యాన్స్ లో టెన్షన్‌!

Published : Apr 18, 2021, 02:55 PM IST

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన `పుష్ప` చిత్ర టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో బన్నీకి `ఐకాన్‌ స్టార్‌` అనే ట్యాగ్‌ ఇచ్చాడు సుకుమార్‌. దీంతో బన్నీ కూడా దాన్ని సంతోషంగా స్వీకరించారు. కానీ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లో మాత్రం కొత్త టెన్షన్‌ పట్టుకుంది. ఎన్టీఆర్‌కి జరిగినట్టే బన్నీకి అవుతుందా? అనే ఆందోళన చెందుతున్నారు. 

PREV
18
ఎన్టీఆర్‌కి జరిగిందే.. అల్లు అర్జున్‌ `ఐకాన్‌స్టార్‌` విషయంలో జరుగుతుందా?.. ఫ్యాన్స్ లో టెన్షన్‌!
అల్లు అర్జున్‌కి ఇప్పటి వరకు స్టయిలీష్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ఉంది. ఇది తెలుగు రాష్టాల్లోనే కాదు, సౌత్‌లోనూ ఇదే పేరుతో పిలుస్తుంటారు అభిమానులు. ఆయన నటన, మ్యానరిజం, డాన్స్ లు, డైలాగులు ఇలా అన్నీ స్టయిల్‌గా ఉంటాయని ఆ ట్యాగ్‌ ఇచ్చారు. ఈ ట్యాగ్‌ `ఆర్య` సినిమాతోనే వచ్చిందని ఇటీవల బన్నీ తెలిపిన విషయం తెలిసిందే.

28
ఇప్పుడు `పుష్ప` సినిమాతో `ఐకాన్‌ స్టార్‌` అనే బిరుదు ఇచ్చేశారు దర్శకుడు సుకుమార్‌. ఇంకా ఎన్ని రోజులు స్టయిలీష్‌ స్టార్‌గా ఉంటావు, మరిపో.. ఇకపై `ఐకాన్‌ స్టార్‌` అని బన్నీని పిలవాలని చెప్పారు సుకుమార్‌. దీంతో అందుకు బన్నీ కూడా సంతోషించాడు. సుకుమార్‌ గారు ఏది ఇచ్చినా అది స్పెషల్‌గా ఉంటుంది. ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ ఈవెంట్‌లో తన సంతోషాన్ని పంచుకున్నాడు బన్నీ.

38
దీంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ఐకాన్‌ స్టార్‌ అంటూ మీమ్స్ చేస్తూ వైరల్‌ చేశారు. ఇంకా చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన ప్రతి న్యూస్‌లో ఐకాన్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ని యాడ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌తో ఊగిపోతుంది.

48
కానీ కొంత మంది అభిమానులు మాత్రం టెన్షన్‌ పడుతున్నారు. బన్నీకి `ఐకాన్‌స్టార్‌` ట్యాగ్‌ నిలబడుతుందా? దాన్ని నిలబెట్టుకునేలా సినిమాలు చేస్తాడా? బాక్సాఫీసు వద్ద అవి సక్సెస్‌ సాధిస్తాయా? అనే ఆందోళన చెందుతున్నారు.

58
ఎందుకుంటే ఆ ఆందోళనకి ఎన్టీఆర్‌ కారణం కావడం విశేషం. ఎన్టీఆర్‌ నటించిన `శక్తి` సినిమా టైమ్‌లో ఆయనకు `ఏ1 స్టార్‌` అనే ట్యాగ్‌ ఇచ్చారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టైటిల్స్ లోనూ ఎన్టీఆర్‌ పేరు వేసే సమయంలో `ఏ1 స్టార్‌- ఎన్టీఆర్‌` అని వేశారు. దీంతో అప్పుడు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఊగిపోయారు. అంతేకాదు `యమదొంగ` తర్వాత ఎన్టీఆర్‌ చేసిన ఫాంటసీ యాక్షన్‌ చిత్రమది. సరికొత్త ప్రయత్నమని చెప్పొచ్చు.

68
దీంతో ఆ సినిమాతో ఎన్టీఆర్‌ `ఏ 1 స్టార్‌` కావడం ఖాయమనుకున్నారు. కానీ అదే ఎన్టీఆర్‌కి పెద్ద దెబ్బేసింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చెందింది. దీంతోపాటు `ఊసరవెల్లి`, `దమ్ము`, `బాద్షా`, `రామయ్యా వస్తావయ్య`, `రభస` చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. `టెంపర్‌` వరకు ఆయనకు బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయాలు వెంటాడాయి. `టెంపర్‌` మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు ఎన్టీఆర్. అదే సమయంలో `ఏ1 స్టార్‌` అనే ట్యాగ్‌ని ఎప్పుడో వదిలేశాడు. ఇప్పటికీ మొదటి నుంచి ఉన్న `యంగ్‌ టైగర్‌` ట్యాగ్‌లైన్‌తోనే రన్‌ అవుతున్నాడు.

78
ఇదే సెంటిమెంట్‌ ఇప్పుడు బన్నీ విషయంలో జరుగుతుందా? అనే అనుమానాలు బన్నీ ఫ్యాన్స్ లో నెలకొన్నాయి. నెటిజన్లు కూడా ఇలాంటి కామెంట్లే చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో పోలుస్తూ మీమ్స్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిదొక హాట్‌ టాపిక్‌గా మారింది.

88
ఇదిలా ఉంటే బన్నీ `ఐకాన్‌`(కనిపించుటలేదు) పేరుతో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమానే చేయబోతున్నట్టు ప్రకటించారు. దిల్‌రాజు నిర్మించనున్నారు. కానీ ఈ సినిమా పక్కకు వెళ్లిపోయింది. కొరటాల శివ కూడా తనకు హ్యాండ్‌ ఇవ్వడంతో మళ్లీ ఇప్పుడు `ఐకాన్‌` సినిమా చేసే అవకాశాలు వినిపిస్తున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories