మహేష్, పవన్, బన్నీ, రానా... ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్స్!

First Published Apr 18, 2021, 1:00 PM IST


ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై కలుగుతుందో చెప్పడం కష్టమే. తొలిచూపు ప్రేమలు కొన్నైతే, పరిచయాలతో కుదిరిన ప్రేమలు కొన్ని ఉంటాయి. ప్రేమించిన అమ్మాయితో లేదా అబ్బాయితో పెళ్లి కుదిరితే ఆ ఆనందమే వేరు. ఇక టాలీవుడ్ లో  కొందరు స్టార్స్ తమకు మనసుకు నచ్చిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
 

అమ్మాయిల కలల రాకుమారుడు మహేష్ ని తొలిచూపులోనే పడవేసింది మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్. వంశీ మూవీ కోసం కలిసిన ఈ జంట, షూటింగ్ ముగిసే నాటికి ప్రేమికులుగా మారిపోయారు. 2005లో మహేష్, నమ్రత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.
undefined
కెరీర్ బిగినింగ్ లో పవన్ కూడా లవర్ బాయ్ ఇమేజ్ కలిగి ఉన్నాడు. కాగా బద్రి సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ రేణూ దేశాయ్ ప్రేమలో పడ్డాడు. ఆమెతో సహజీవనం చేసిన పవన్ 2009లో వివాహం చేసుకున్నారు.  అయితే 2012లో ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్, రష్యన్ హీరోయిన్ అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు.
undefined
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రేమలో పడ్డారు. హైదరాబాద్ లో ప్రముఖ విద్యాసంస్థల అధిపతి కూతురు స్నేహారెడ్డిని ఓ వేడుకలో అల్లు అర్జున్ కలిశారు. తొలిచూపులోనే, స్నేహారెడ్డికి పడిపోయిన అల్లు అర్జున్ 2011లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి స్నేహారెడ్డి తండ్రి మొదట్లో ఒప్పుకోకపోవడం విశేషం.
undefined
మరో యంగ్ హీరో నిఖిల్ 2020లో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. నిఖిల్ కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం. డాక్టర్ పల్లవితో పరిచయం ప్రేమగా మారగా, పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
undefined
హీరో నితిన్ గత ఏడాది తన ప్రేయసి షాలిని మెడలో మూడుముళ్లు వేశారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన షాలినితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు నితిన్. కోవిడ్ కారణంగా అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.
undefined
ఇక టాలీవుడ్ హల్క్ రానా ప్రేయసిని పరిచయం చేయడం, పెళ్లి చేసుకోవడం  చకచకా జరిగిపోయాయి. ఫ్రెండ్ మిహికా బజాజ్ తో పరిచయం ప్రేమకు దారి తీసింది. రానా ప్రేమను ఒప్పుకొని, అతనితో ఏడు అడుగులు వేసింది మిహిక.
undefined
అక్కినేని వారసుడు నాగ చైతన్య మొదటి హిట్ ఏంమాయ చేశావే. ఆ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత ప్రేక్షకులతో పాటు, చైతూను కూడా మాయలో పడవేసింది. 2017లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
undefined
దగ్గుబాటి లక్ష్మీతో విడాకుల తరువాత నాగార్జున హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. 1992లో వీరి వివాహం జరిగింది.
undefined
click me!