కొత్తింటికి భోజనానికి పిలుద్దామనుకున్నా.. అంతలోనే ఇలా అయిపోయింది.. అల్లు అర్జున్‌ ఎమోషనల్‌

Published : Sep 11, 2022, 08:33 PM ISTUpdated : Sep 11, 2022, 10:17 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కృష్ణంరాజు మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన్ని త్వరలోనే భోజనానికి ఆహ్వానించాలని అనుకున్నట్టు చెప్పారు.   

PREV
16
కొత్తింటికి భోజనానికి పిలుద్దామనుకున్నా.. అంతలోనే ఇలా అయిపోయింది.. అల్లు అర్జున్‌ ఎమోషనల్‌

తెలుగు తెర రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతి తీవ్ర సంతాపాన్ని తెలిపారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్. నిన్న(శనివారం) రాత్రి బెంగుళూరులో జరిగిన సైమా వేడుకలకు వెళ్లిన ఆయన ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆ వెంటనే తన ఇంటికి దగ్గర్లో ఉన్న కృష్ణంరాజు పార్థివే దేహాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్‌ అయ్యారు. 
 

26

జూబ్లీహిల్స్ లోని కృష్ణంరాజు ప్రస్తుత ఇంటికి సమీపంలోనే తాను కొత్తిళ్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. మరో ఏడాదిన్నరలో ఆ కొత్తిళ్లు నిర్మాణం పూర్తవుతుంది. చాలా లావిష్‌గా కడుతున్న ఆ ఇంటి నిర్మాణం పూర్తి కాగానే పక్కనే ఉన్న కృష్ణంరాజుగారి ఫ్యామిలీని ఇంటికి ఆహ్వానించాలని అనుకున్నారట. లంచ్‌కి కృష్ణంరాజుగారి ఫ్యామిలీని లంచ్‌ని పిలుద్దామని, వారి కొత్తింటిని ఎంజాయ్‌ చేస్తారని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని తెలిపారు. 

36

వారిని ఇంటికి పిలవాలని ఎంతో ముచ్చటపడ్డాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. కృష్ణంరాజుగారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. తీరని లోటు అని తెలిపారు బన్నీ. ఆయన గురించి చెప్పేంత వయసు తనకు లేదని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు ఐకాన్‌ స్టార్‌. ఈ సందర్భంగా ప్రభాస్‌ని హగ్‌ చేసుకుని ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు బన్నీ. కృష్ణంరాజు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. 
 

46

అంతకు ముందు ట్విట్టర్‌ ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ, `కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. 

56

కృష్ణంరాజు భౌతిక కాయానికి రేపు(సోమవారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మోయినాబాద్‌లోని కనకమామిడిలో గల కృష్ణంరాజు ఫామ్‌ హౌజ్‌ ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
 

66

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప 2` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories