బావ రామ్ చరణ్ కోసం బామ్మర్ది అల్లు అర్జున్ ఓ సినిమా చేశారు. గెస్ట్ రోల్‌లో నటించారు. క్రేజీ కథాంశంతో వచ్చిన ఆ మూవీ బంపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.
మొన్నటి వరకు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ కనిపించింది. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలే అందుకు కారణంగా చెప్పొచ్చు. అయితే ఇటీవల ఆ గ్యాప్ సెట్ అయ్యిందనిపిస్తోంది. అల్లు రామలింగయ్య భార్య, అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ మరణంతో వీరంతా కలిసిపోయారు. అంతా ఒక్కటే అని నిరూపించారు. ఈ సందర్భంగా అటు అల్లు అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇలానే ఉండాలని కోరుకున్నారు. అయితే మెగా హీరోల్లో ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ లుగా మెరవడం అడపాదపా జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్, చిరు సినిమాల్లో పవన్, బన్నీ, చరణ్ కూడా మెరిశారు. అయితే బావ చరణ్ కోసం అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ చేశారు.
25
ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా అల్లు అర్జున్, రామ్ చరణ్
ఇటీవల కాలంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య పడటం లేదు. ముఖ్యంగా `ఆర్‌ఆర్‌ఆర్`, `పుష్ప` సమయం నుంచి ఈ పోటీ నెలకొంది. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేసుకుంటున్నారు. అదే సమయంలో వీరి మధ్య కూడా కొంత గ్యాప్ కనిపిస్తూ వచ్చింది. మొన్నటి సంఘటనతో వీరు కూడా క్లోజ్ అయిపోయారు. కానీ ఒకప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ కావడం విశేషం. ఈ ఇద్దరు కలిసి ఓ మూవీలో కూడా నటించారు. బావ కోసం బన్నీ గెస్ట్ రోల్ చేశారు. ఆ మూవీ ఏంటనేది చూస్తే.
35
`ఎవడు` మూవీలో గెస్ట్ రోల్ చేసిన బన్నీ
రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ మూవీస్‌లో `ఎవడు` ఒకటి. వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 2014లో విడుదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్, శృతి హాసన్ జంటగా నటించారు. ఈ సినిమా అప్పటి వరకు రామ్ చరణ్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. `మగధీర` తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయడం విశేషం.
`ఎవడు` మూవీ `ఫేస్ ఆఫ్` అనే హాలీవుడ్ చిత్రానికి స్ఫూర్తి. యాక్సిడెంట్‌లో ఓ ప్రేమ జంట చనిపోతుంది. ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ మరో జంటకి.. చనిపోయిన జంట ఫేస్‌లను ట్రాన్స్ ఫ్లాంటేషన్ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వారి ఫేస్‌లు మారిపోతాయి. దీంతో ఈ ప్రమాదంలో రామ్ చరణ్, శృతి హాసన్ ప్రేమ జంట చనిపోతే, వారి ఫేస్‌లను అల్లు అర్జున్, కాజల్ జంటలకు ట్రాన్స్ ఫ్లాంటేషన్ చేస్తారు. ఆ తర్వాత వారి జర్నీ ఎలా సాగిందనేది మూవీ. ఇందులో ప్రారంభంలో ప్రేమ జంటగా అల్లు అర్జున్, కాజల్ కనిపిస్తారు. కాసేపు మెరుస్తారు. అలా బావ చరణ్ కోసం బన్నీ ఈ మూవీ చేశారని చెప్పొచ్చు. సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లో ఈ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అది వారి మధ్య స్నేహాన్ని, రిలేషన్‌ని ప్రతిబింబిస్తుంది.
55
`పెద్ది`తో చరణ్, అట్లీ మూవీతో బన్నీ బిజీ
ప్రస్తుతం చరణ్ `పెద్ది` మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. సూపర్ హీరో కథాంశంతో సైన్స్ ఫిక్షన్‌గా ఇది రూపొందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.