#Hanuman బడ్జెట్ ఎంత, బిజినెస్ ఎంత చేసారు? షాకింగ్ లెక్కలు

First Published Jan 8, 2024, 8:36 AM IST

నార్త్ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేస్తున్న ‘హను-మాన్‌’ పూర్తి రికవరీ మోడ్ లో ఉందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత... ఎంత బిజినెస్ చేసారు వంటి విషయాలు చూద్దాం.


అనేక చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ (Teja Sajja) హీరోగా మారిన సంగతి తెలిసిందే. అతడి తాజా చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu)- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అదే రోజున రాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రంకు థియేటర్స్ తక్కువ కేటాయించారని వివాదాలు సైతం వచ్చాయి. అయితే నార్త్ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేస్తున్న ‘హను-మాన్‌’ పూర్తి రికవరీ మోడ్ లో ఉందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత... ఎంత బిజినెస్ చేసారు వంటి విషయాలు చూద్దాం.


ఈ సినిమాలో ఎలాంటి స్టార్  లేక‌పోయిన‌ప్ప‌టికీ ఈ సినిమాకు ఏకంగా రూ.55  కోట్లు బ‌డ్జెట్ ఖ‌ర్చు పెట్టార‌ట‌. పబ్లసిటీ,మిగతా ఖర్చులు అన్నీ కలిపి మరో ఐదు కోట్లు అయ్యిందని మొత్తం 60 కోట్లకు రీచ్ అయ్యిందని సమాచారం. అయితే మొదట అనుకున్న బడ్జెట్ ప్రాజెక్టు లేటు అవుతూ రావటంతో  వడ్డీలు పెరగటంతో పెరిగిందని అంటున్నారు. అయితే  క‌థ మీద న‌మ్మ‌కంతో ఇంత పెద్ద మొత్తంలో బ‌డ్జెట్ ను ఖ‌ర్చు పెట్టినట్లు తెలుస్తోంది. పెట్టిన బ‌డ్జెట్ లో ఇప్ప‌టికే డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మెజారిటీ రిక‌వ‌రీ అయింద‌ని, థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా భారీగా జ‌రిగింద‌ని స‌మాచారం.  

Latest Videos


అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నాన్ థియేటర్ బిజినెస్ రైట్స్ ని Zee గ్రూప్ వారు 30 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో బడ్జెట్ లో సగం అక్కడే రికవరీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 20 కోట్లుకు బిజినెస్ చేసారని తెలుస్తోంది. అలా మొత్తం 50 కోట్ల వరకూ బడ్జెట్ నాన్ థియేటర్ రైట్స్, తెలుగు రాష్ట్రాల బిజినెస్ తో రికవరీ అయ్యిందని సమాచారం. ఇక సినిమా ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో మిగతా ప్రాంతాలు, ముఖ్యంగా నార్త్ బెల్ట్  మంచి బిజినెస్ చేసాయి.


ఓవర్ సీస్ లో బుక్కింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. చాలా స్ట్రాంగ్ గా అక్కడ టిక్కెట్ల అమ్మకం జరుగుతోంది. హిందిలో అయితే భారీగా ఎక్సపెక్ట్ చేస్తున్నారు. మరో కార్తీకేయ 2 అవుతుందని భావిస్తున్నారు. ఓవర్ సీస్ , నార్త్ ,తెలుగు రాష్ట్రాల మినహా సౌత్ రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళతో మాగ్జిమం మిగతా ఎమౌంట్ రికవరీ అవుతోంది. ఇక నార్త్ బెల్ట్ లో వచ్చేదంతా లాభమే. అంతేకాదు ఈ సినిమాని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది హనుమాన్ టీమ్. అది కలిసొచ్చే మరో అంశం. ఇలా సినిమా ఏ మాత్రం బాగున్నా నిర్మాతకు డబ్బులు పంటే అని చెప్పాలి.


తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... ‘హనుమాన్’ మూవీని సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమే అయ్యాయని ఒక సందర్భంలో ప్రశాంత్ వర్మనే ఓపెన్‌గానే వాపోయాడు. అంతే కాకుండా కచ్చితంగా జనవరి 12న తన సినిమా విడుదల అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే అదే సమయంలో నైజాం, ఆంధ్రాలో అత్యధికంగా గుంటూరు కారం సినిమాకే ఎక్కువ కేటాయించారనే విషయం చర్చనీయాంశమైంది.

Hanu Man


 గుంటూరు కారం చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను దిల్‌రాజు తీసుకున్నారు. జనవరి 12న గుంటూరు కారంతోపాటు హనుమాన్‌ కూడా రిలీజ్‌ అవుతోంది. అందుకే హనుమాన్‌ను దెబ్బతీసేందుకు నైజాంలో 95 శాతం థియేటర్లను గుంటూరు కారం చిత్రానికే కేటాయించారు. హైదరాబాద్‌లో 96 సింగిల్‌ స్క్రీన్‌లు ఉండగా అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. హనుమాన్‌ చిత్రానికి నాలుగైదు థియేటర్లే కేటాయించారని తెలుస్తోంది. దిల్‌రాజు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హనుమాన్‌ చిత్రానికి ఎలాంటి నష్టం జరుగుతుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 అయితే ఈ నేపథ్యంలో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దిల్ రాజు‌తో మాట్లాడినప్పుడు మా సమస్య గురించి క్లారిటీ చెప్పాం. మాది పాన్ ఇండియా సినిమా. నార్త్, ఇతర భాషల్లో రిలీజ్‌కు ఏర్పాట్లు జరిగిపోయాయి. మేము డేట్ మార్చుకోలేని పరిస్థితి. 11వ తేదీ గానీ, 14వ తేదీ గానీ రావడానికి వీలు కాదు. తెలుగు రాష్ట్రాలతోపాటు అన్నిభాషల్లో రిలీజ్ చేస్తున్నందున రిలీజ్ డేట్ మార్చుకోలేం. అంతేగానీ.. మీ సినిమా మీద కాంపిటిషన్‌గా వేయడం లేదు అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
 


అంతేకాదు హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నాం. అందుకని మేము ఏ సినిమాను చిన్నచూపు చూడటం లేదు. అయితే రిలీజ్ వాయిదా పడితే మాకు భారీగా నష్టం వాటిల్లుతుంది. సంక్రాంతికి హిందీ, తెలుగు, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో చైనీస్, జపాన్, కొరియన్ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని నిరంజన్ రెడ్డి చెప్పారు.
 


హనుమాన్ సినిమాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. మేము ఒంటరి పోరాటం చేస్తున్నాం. ఈ సినిమాకు చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వారు వస్తున్నారు. రవితేజ తన ఈగిల్ సినిమా ఉన్నా.. మా సినిమాలోని ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అందుకు థ్యాంక్యూ చెప్పడం చిన్న మాట అవుతుంది. అంత గొప్ప పనిచేశారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
 


 అలాగే  సంక్రాంతి విడుదలల గురించి మాట్లాడడానికి తాజాగా తెలుగు నిర్మాతలంతా ప్రెస్ మీట్ పెట్టగా.. అందులో ‘హనుమాన్’ మూవీ రిలీజ్‌పై స్పందించారు దిల్ రాజు. ‘‘ప్రశాంత్ వర్మ నన్ను కలిసి మాట్లాడారు. అప్పుడు నిరంజన్ రెడ్డి అందుబాటులో లేరు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలా ట్రై చేసుకోండి అని నేను చెప్పాను. 12,13,14,15 ఇలా. మేజర్‌గా హిందీ టార్గెట్ చేస్తున్నాం. అందుకే 12న విడుదల కావాలి. వేరే ఆప్షన్ లేదు అని ప్రశాంత్ వర్మ చెప్పారు. 

Dil Raju, hanuman


ప్రశాంత్ వర్మ చెప్పిన దాన్నిబట్టి వారు మేజర్‌గా హిందీ రిలీజ్ కోసం చూస్తున్నారు కాబట్టి అలా అంటే వారికి శుక్రవారమే రిలీజ్ ఉండాలి. కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. ‘గుంటూరు కారం’ అయితే ఎప్పటినుండో అదే రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పెద్ద స్టార్ సినిమా కాబట్టి వారు వారం మొత్తం వారికే కావాలని చూస్తారు. వారు కూడా మారడానికి ఛాన్స్ లేదు. రెండు సినిమాలు ఒకేరోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి’’ అంటూ ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’కు పోటీ తప్పదని దిల్ రాజు తెలిపారు.


 
తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్.. అన్నీ ఈ జోనర్ సినిమాలు ఇష్టపడేవారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి.


 పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. ఫైనల్‌గా దిల్ రాజు చెప్పినదాని ప్రకారం సంక్రాంతికి ‘గుంటూరు కారం’ వర్సెస్ ‘హనుమాన్’ పోటీ తప్పదని అర్థమవుతోంది.

ఈ సినిమాలో   దైవభక్తిని, దేశభక్తిని కూడా ప్రశాంత్ వర్మ చక్కగా చూపించబోతున్నారని తెలుస్తోంది. అలాగే సైన్స్ ను కూడా జోడించడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. చిరుతపులితో పరిగెత్తడం, కొండను ఎత్తడం, హనుమాన్ భారీ విగ్రహం, వరలక్ష్మి మాస్ సీన్స్, బీజీఎం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్. 12 జనవరి 2024న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడు. కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.గెటప్ శ్రీను, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

click me!