రాజమౌళిని నిజంగానే అలియాభట్‌ అన్‌ఫాలో చేసిందా?.. వాస్తవం ఏంటంటే?

Published : Mar 29, 2022, 01:38 PM ISTUpdated : Mar 29, 2022, 04:49 PM IST

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కోపంతో రగిలిపోతుంది. కారాలు మిర్యాలు నూరుతుంది. కనిపిస్తే కడిగేస్తానంటోంది. ఇంతకీ ఆలియా భట్ కోపం ఎవరిమీదో తెలుసా...? స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై. 

PREV
17
రాజమౌళిని నిజంగానే అలియాభట్‌ అన్‌ఫాలో చేసిందా?.. వాస్తవం ఏంటంటే?

'ఆర్ఆర్ఆర్' సినిమాతో సౌత్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. గ్రాండ్ ఎంట్రీ అని మనం అనుకోవడమే కాని ఇది ఎలాంటి ఎంట్రీనో తెలియడం లేదు ఆడియన్స్ కు  రాజమౌళి డైరెక్షన్ అనగానే రెండో ఆలోచన లేకుండా ఎగిరి  గంతేసి ఈ సినిమాకు అలియా ఓకే చెప్పేసింది. అయితే చివరకు ఆమెకు నిరాశ మాత్రమే మిగిలిందట.

27

బాలీవుడ్ లో ఆలియా భట్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెను సినిమాలోకి తీసుకోవడమే బాలీవుడ్ ఆడియన్స్ ను ఈ సనిమా వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా చేశాడు జక్కన్న. ఈ లెక్కన చూసుకుంటే ఆలియా భట్ పాత్ర  ఏ రేంజ్ లో ఉంటుందో అ అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. కాని చివరకు అందరికి నిరాశే ఎదురయ్యింది. 

37

ట్రిపుల్ ఆర్  సినిమాలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది అయినా.. సినిమా మొత్తం  మీద చాలా తక్కువ నిడివి మాత్రమే కనిపిస్తుంది.ఎన్నో ఆశలతో ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన అలియాకు... స్క్రీన్ పై పెద్దగా స్పేస్ లేకపోయేసరికి షాక్ తగిలినట్టయిందట. దీంతో ఆమె పూర్తిగా డిజప్పాయింట్‌ అయినట్టు తెలుస్తాంది. బాలీవుడ్ లో కూడా ఇదే డిస్కషన్‌ నడుస్తుండటంతో ఆలియాకు అవమానకరంగా అనిపించిందట. 

47

దాంతో ఆమె  జక్కన్న మీద చాలా కోపంగా ఉన్నట్టు సమాచారం. అంతే కాదు తన రాజమౌళి ఇన్‌స్టాగ్రామ్‌ ని అన్‌ఫాలో చేసినట్టు సోషల్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో పాటు `ఆర్ఆర్ఆర్` కు సంబంధించిన కొన్ని పోస్ట్ లు ఫోటోలు డిలీట్ చేసినట్టు సమాచారం. 
 

57

ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ పోన్ అవ్వక ముందు  నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అలియా చాలా ఉత్సాహంగా పాల్గొంది. అయితే విడుదల తేదీ ఖరారైన తర్వాత జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం ఆమె కనిపించలేదు. కేవలం ఢిల్లీ ఈవెంట్‌లో మాత్రమే పాల్గొంది.
 

67

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సినిమా రిలీజ్ అయిన తరువాత సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నా.. కనీసం తన సోషల్ మీడియా ఫేజ్ లో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు ఆలియా భట్. అంతేకాదు సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ... అలియా కనీసం విష్ చేయలేదు.  ఇదంతా చూస్తుంటే అటు `ఆర్‌ఆర్‌ఆర్‌`పై, ఇటు జక్కనపై అలియా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మరి నిజాలేంటనేది తెలియాల్సి ఉంది.

77

ఇదిలా ఉంటే మొదట అలియాభట్‌ రాజమౌళిని అన్‌ఫాలో చేసినట్టు తెలుస్తుంది. ఈ స్క్రీన్‌ షాట్లని నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి వైరల్‌ చేస్తున్నారు. అయితే వెంటనే తేరుకుని ఆమె మళ్లీ ఫాలోయింగ్‌ కొట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటో చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. మొత్తంగా రాజమౌళిపై అలియాభట్‌ తన అసహనాన్నిఈ రూపంలో వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె `బ్రహ్మాస్త్ర` ప్రమోషనల్‌ బిజీగా ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories