ఇది కర్నాటక మైసూర్ సిల్క్ చీర కాగా.. ఆ చీరపై ఎంతో అందంగా.. రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను డిజైన్ చేసారు. రాముడు శివ ధనుస్సును విరవడం, రాముడిని అడవికి వెళ్లమని అడగడం, గంగా నదిపై వంతెన, బంగారు జింక, సీతాపహరణ వంటి రామాయణ ఘట్టాల చిత్రాలు ఈ చీరపై డిజైన్ చేసారు. దాంతో ప్రస్తుతం ఈ చీర స్పెషల్ గా వార్తల్లోకి ఎక్కింది. నెట్టింట వైరల్ అవుతోంది.