ఆలియా భట్‌,రణ్ బీర్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. పెళ్ళి పనుల్లో ఫ్యామిలీ బిజీ బిజీ..

Published : Mar 28, 2022, 09:17 PM IST

బాలీవుడ్ ప్రేమ పక్షులు ఆలియాభట్,రణ్ భీర్ పెళ్ళి ఎప్పుడు..? అదిగ ఫిక్స్.. ఇదిగో ఫిక్స్.. డేట్ లాక్ చేసుకున్నారు అని అంటం తప్పించి, కరెక్ట్ డేట్ చెప్పిన వారులేరు. ఇక రీసెంట్ గా వారి పెళ్లి గురించి ఫ్యామిలీ మెంబర్స్ ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చేస్తున్నారు.   

PREV
17
ఆలియా భట్‌,రణ్ బీర్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. పెళ్ళి పనుల్లో ఫ్యామిలీ బిజీ బిజీ..

అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ల పెళ్లి గురించి చాలా కాలంగా.. చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ బాలీవుడ్  లవ్‌ బర్డ్స్‌ పెళ్లి గురించి సోషల్‌ మీడియాల్లో ఎప్పటికప్పుడు వార్తలు  జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంటాయి. కాని వారి పెళ్లిపై ఇప్పటి వరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మరోసారి వీరి పెళ్లి అంశం వార్తల్లో నిలిచింది. 
 

27

ఈ సారి మాత్రం రణ్‌బీర్‌-అలియాల పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. ఈ జంటకు వెడ్డింగ్‌ బెల్స్‌ దగ్గరికి వచ్చాయని సమాచారం. సోషల్ మీడియాలో వీరి పెళ్శి గురించి రెండు డేట్లు వినిపిస్తున్నాయి. వీరు నెక్ట్స్ మన్త్ అంటే ఈ ఏప్రిల్‌లోనే  ఒక్కటవ్వబోతున్నారంటూ బిటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాదు కాదు వీరి పెళ్లి వచ్చే అక్టోబర్ లో అంటూ మరో డేట్ ప్రచారంలో ఉంది. 
 

37

అయితే వీరి పెళ్ళికి సంబంధించిన వార్త ఇప్పుడు బయటకు రావడానికి కారణం ఏంటీ అంటే.. వీరి పెళ్లి కోసం ఏర్పాట్లు స్టార్ట్ అయ్యాయంట. తాజా బజ్‌ ప్రకారం..రణ్‌బీర్‌ తల్లి నీతు కపూర్‌ సెలబ్రెటీ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా స్టోర్‌లో కనిపించారు.అంతేకాదు మనిష్‌ కూడా ఈ మధ్య తరచూ కపూర్‌ ఇంటికి వెళ్లడంతో అదరికి డౌట్ మొదలయ్యింది. 
 

47

రణ్‌బీర్‌, అలియా పెళ్ళి పనులు స్టార్ట్ అయ్యాయి అని. అందులో భాగంగానే నీతు కపూర్‌ మనీష్‌ మల్హోత్రా కి పెళ్ళి బట్టలు ప్రత్యేకంగా డిజైన్‌ చెసే బాధ్యలను అప్పగించినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు అలియా, రణ్‌బీర్‌లు కూడా తమ రెగ్యూలర్‌ షూటింగ్‌కు బ్రేక్‌ కావాలని, కొద్ది రోజులు షూటింగ్‌కు విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు టాక్. 

57

ఇక వీరి  వివాహం ఏప్రిల్‌ నెలమధ్యలో జరగనుందంటూ బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అలియా భట్  ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సక్సెస్ జోష్ లో ఉంది. ఎంజాయ్‌ చేస్తుంది. అంతే కాదు రణ్‌బీర్‌, అలియాలు కలిసి  బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

67

రీసెంట్ గా వారణాసీలో బ్రహ్మాస్త్రా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు ఈ లవ్‌బర్డ్స్‌. నెక్ట్స్ మూవీ షూటింగ్స్ కూడా కొన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. రణ్‌బీర్‌ లవ్‌ రంజన్‌ మూవీ షూటింగ్‌లో,అలియా రాజా జౌర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరు షూటింగ్‌లకు సెలవు పెట్టే ఆలోచనలో ఉన్నారట. సెలవు పెట్టి పెళ్ళి కార్యక్రమాల్లో బిజీ అయిపోవాలి అని చూస్తున్నారు. 
 

77

మరి ఈసారైన ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతారో లేదో చూడాలి. చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నారు బాలీవుడ్‌ లవబర్డ్స్‌ రణ్ బీర్,ఆలియా. ఈమధ్య బాలీవుడ్ లవ్ కపుల్స్ వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ ఘనం పెళ్లి చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరి ఫర్హాన్‌ అక్తర్‌-శిబాని దండేకర్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ ఏడాది ఆలియా, రణ్ బీర్ లు కూడా పక్కాగా నిఖా చేసుకుంటారని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories