యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ బ్యూటీ హ్యాండ్ ఇచ్చిందట, అంతే కాదు దానికి కారణం కూడా ఆలియా భట్ భర్త రణ్ బీర్ కపూర్ అంట. అసలు ఆలియా భట్ తారక్ కు హ్యాండ్ ఇవ్వడం ఏంటీ..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా రిలీజ్ కాగానే ఈ సినిమా పట్టాలెక్కించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. త్వరలో షూటింగ్ కు సన్నాహాలు చేసుకుంటున్నారు.
26
ఎన్టీఆర్30 ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో తారక్ జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వార్తలు రావడం కాదు... ఆలియా భట్ కూడా కొన్ని ఇంటర్వ్యూలలో కన్ ఫార్మ్ చేశారు కూడా.
36
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..ఈ ప్రాజెక్టు నుంచి ఆలియా తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు ఆలియా భట్ కూడా చెప్పేసిందట. ఈ పరిణామంతో అంతా షాక్ అయినట్టు తెలుస్తోంది.
46
నిన్ననే తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్ ను పెళ్ళాడింది ఆలియా భట్. ముంబయ్ లోని రణ్ భీర్ నివాసంలో అతికోద్ది మంది బంధు మిత్రుల సమక్షం లో పెళ్లి బంధంతో ఒక్కటైయ్యారు ఈ జంట. అయితే ఈ కారణంగా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించేందుకు ఆలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
56
రణ్ బీర్ ను పెళ్లాడిన ఆలియా.. ఈ ఏడాదంతా తన భర్తతో వేకేషన్లను ప్లాన్ చేసుకుంటుందట. ఈ ఏడాది అంతా దాదాపు వీరిద్దు హ్యాపీగావిదేశాల్లో గడిపేలా ప్లాన్ చేశారట. దాంతో ఇప్పుడు షూటింగ్ లో ఉన్న సినిమాలు పెండింగ్ లోపెట్టి.. రీసెంట్ గా సైన్ చేసిన సినిమాలు వదిలేయాలి అనుకుంటుందట ఆలియా భట్.
66
మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కాని.. నిన్ననే ( ఏప్రిల్ 14) పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు బాలీవుడ్ జంట ఇప్పట్లో సెట్స్ ఎక్కుతారా అనేది అనుమానమే అంటున్నారు సినీ జనాలు. ఇక రీసెంట్ గా ఆలియా భట్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రభంజనం సృస్టించిన విషయం తెలిసిందే.