F3 Movie: 'ఎఫ్3' లో పూజా స్పెషల్ అఫిషల్.. ఐటెం సాంగ్ కి ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకే.. జిగేల్ రాణినా మజాకా..

Published : Apr 15, 2022, 12:22 PM ISTUpdated : Apr 15, 2022, 12:25 PM IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎఫ్3’. ఈ మల్టీస్టారర్ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ఐటెం సాంగ్ లో నటిస్తున్నట్టు కన్ఫమ్ అయ్యింది. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ సాంగ్ నుంచి క్రేజీ ఫోటోను రిలీజ్ చేశారు.  

PREV
16
F3 Movie: 'ఎఫ్3' లో పూజా స్పెషల్ అఫిషల్.. ఐటెం సాంగ్ కి ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకే.. జిగేల్ రాణినా మజాకా..

చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు.. జానర్ ఏదైనా దర్శకనిర్మాతలు తప్పకుండా స్పెషల్ సాంగ్ ఉండేలా చూస్తున్నారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు సపరేట్ గా హీరోయిన్లు ఉండేవారు. కానీ ప్రస్తుతం టాప్ హీరోయిన్లే  స్పెషల్ సాంగ్స్ లో నటిస్తున్నారు. 

26

ఏకంగా హీరోయిన్లే గ్లామర్ ఒళకబోస్తూ.. ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. దీంతో సినిమాలపైనా ఆసక్తి కూడా పెరుగుతోంది. ఈ వరుసలో ప్రస్తుతం మిల్క్ బ్యూటీ తమన్నా (Thamannaah), సమంత (Samantha), పూజా హెగ్దేల పేర్లు ఇండస్ట్రీలో మోత మోగుతున్నాయి. ఈ ముద్దుగుమ్మలు కూడా  స్పెషల్ సాంగ్స్ లో నటించి తమ పాపులారిటీని మరింత పెంచుకుంటున్నారు. 
 

36

స్టార్ లేడీగా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డే (Pooja Hegde) దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్3’లో ఐటెం సాంగ్ లో  నటిస్తున్నట్టు కన్షమ్ అయ్యింది.  విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ (Varun Tej)లు నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ F3లో పూజాహెగ్దే నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. 
 

46

మేకర్స్ తాజాగా  ఎఫ్3 మూవీ అప్డేట్ ఇస్తూ.. స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న  పూజా హెగ్దే క్రేజీ ఫొటోను వదిలారు. జిగేలు రాణి వెనుదిరిగిన ఫొటోను రిలీజ్ చేస్తూ.. ఈ ఐటెం గర్ల్ ఎవరో గుర్తుపట్టండి అంటూ నెటిజన్లలో ఆసక్తి పెంచారు. ఇప్పటికే ఐటెం నంబర్ చేసిన పూజాను ఆడియెన్స్ ఇట్టే గుర్తుపట్టేశారు. ఈ ఫోజులో పూజా రెడ్ డ్రెస్ లో మతిపోగొడుతోంది. ఇక ఫుల్ సాంగ్ తో సమ్మర్ హీట్ పెంచనుందీ బ్యూటీ. 
 

56

పూజా హెగ్డే గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘రంగస్థలం’ సినిమాలో 'జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌ జిగేల్‌రాణి..' అంటూ అభిమానులను ఊర్రూతలూగించింది. మరోసారి ఎఫ్3లో ఐటం సాంగ్ తో అందాలు ఆరబోయనుంది. అయితే ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.కోటికిపైగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. రూ.1.25 కోట్లు అడిగినట్టు సమాచారం. 

66

‘ఎఫ్2’తో తెలుగు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా తమన్నా, మెహరీన్ ఫిర్జాదా నటిస్తున్నారు. మే 27న ఈ మల్టీస్టారర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు... పూజా హెగ్దే ఐటెం సాంగ్ చేస్తుండటంతో మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 


 

click me!

Recommended Stories