పింక్ శారీలో చిరునవ్వుల జల్లులు కురిపిస్తున్న ఆర్ఆర్ఆర్ నటి.. చూపుతిప్పుకోలేని సొగసుతో మాయ చేస్తున్న అలియా

Published : Aug 03, 2023, 07:17 PM ISTUpdated : Aug 03, 2023, 07:18 PM IST

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది.

PREV
19
పింక్ శారీలో చిరునవ్వుల జల్లులు కురిపిస్తున్న ఆర్ఆర్ఆర్ నటి.. చూపుతిప్పుకోలేని సొగసుతో మాయ చేస్తున్న అలియా

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. 

29

అలియా రణబీర్ జంటకి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలియా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ నే సినిమాలు కూడా మొదలు పెట్టేసింది. అలియా భట్ తల్లి కాక ముందు ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటించింది. 

39

అలియా నటించిన చివరి రెండు చిత్రాలు అవే. ఇప్పుడు తల్లి అయిన తర్వాత అలియా రీఎంట్రీ మూవీ వచ్చేసింది. రణ్వీర్ సింగ్ కి జోడిగా నటించిన కుటుంబ కథా చిత్రం రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రం జూలై 28న థియేటర్స్ లోకి వచ్చింది. 

49

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రణ్వీర్ సింగ్, అలియా భట్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయినట్లు చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 

59

ఈ చిత్రంలో జయ బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రాన్ని మంచి రెస్పాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది. 

69

ప్రచార కార్యక్రమాలు కూడా అంతే జోరుగా సాగుతున్నాయి. రణ్వీర్ సింగ్, అలియా, కరణ్ జోహార్ ముగ్గురూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ జోరు తగ్గడం లేదు. 

79

తాజాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా అలియా భట్ పింక్ శారీలో మెరుపులు మెరిపించింది. కళ్ళు చెదిరే విధంగా హొయలు పోతూ తన గ్లామర్ తో అట్రాక్ట్ చేస్తోంది. 

89

స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చిరునవ్వులు చిందిస్తూ నిలువెత్తు సొగసుతో ఈ క్యూట్ బ్యూటీ మాయ చేస్తోంది. రణ్వీర్ సింగ్ తో కలసి ఎంతో అందంగా వేదికపై నిలబడింది. 

99

వివాహం తర్వాత కూడా అలియా భట్ జోరు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో మెప్పించింది. తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అలియా పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. 

click me!

Recommended Stories