బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ కుమార్ కి ఈ మధ్యన అంతగా కలసి రావడం లేదు. బాలీవుడ్ లో అత్యధిక 100 కోట్ల వసూళ్లు సాధించిన హీరోల జాబితాలో అక్షయ్ కుమార్ కూడా ఉంటారు. అక్షయ్ కుమార్ సినిమా చేస్తే 100 కోట్లు గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది.
కానీ ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ లో అక్షయ్ కుమార్ నటించిన బడే మియా చోటే మియా చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం మెప్పించలేకపోయింది. యాక్షన్ చిత్రంగా విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ రిజల్ట్ ఎదుర్కొంది.
రీసెంట్ గా అక్షయ్ కుమార్ నటించిన మరో చిత్రం విడుదలైంది. ఆ మూవీ సర్ఫిరా. సూర్య జాతీయ అవార్డు అందుకున్న ఆకాశం నీ హద్దురా చిత్రానికి ఇది రీమేక్. 100 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం 20 కోట్లు వసూలు చేయడానికి ఆపసోపాలు పడింది. ఫలితంగా ఈ ఏడాది అక్షయ్ కి వరుసగా రెండో డిజాస్టర్.
తన చిత్రాలు తేడా కొడుతుండడంతో అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమాని అభిరుచితో, కష్టంతో తెరకెక్కిస్తాం. అలాంటప్పుడు సినిమా ఫ్లాప్ అయితే చాలా బాధగా ఉంటుంది. ప్రతి ఫెయిల్యూర్ లో పాజిటివ్ అంశాలు నేర్చుకోవాలి.
కెరీర్ ఆరంభం నుంచే నాకు ఇది అలవాటైంది. ఇలాంటి పరాజయాలు నాకు కెరీర్ ఆరంభం లో కూడా ఎదురయ్యాయి. నేను చేసిందల్లా ఒక్కటే.. మరింతగా కష్టపడి ప్రేక్షకులకు కొత్త చిత్రాన్ని అందిస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే చేస్తా అని అక్షయ్ కుమార్ అన్నారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రేక్షకుల అభిరుచితో మార్పు వచ్చింది. దానిని గమనించి సినిమాలు ఎంచుకోవాల్సి అవసరం ఉందని అర్థం అయింది. ప్రేక్షకులు తమకి నచ్చిన సినిమాని ఎంచుకుని థియేటర్స్ కి వస్తున్నారు అని అక్షయ్ కుమార్ అన్నారు.