Raveena Tandon: జనరేటర్ వ్యాన్‌లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఆమె డెడికేషన్ కి స్టార్ హీరో ఫిదా

Published : Jun 12, 2026, 05:41 PM IST

ఇన్నేళ్లలో రవీనాలో ఏం మారింది? అని అడిగిన ప్రశ్నకు అక్షయ్ కుమార్ బదులిస్తూ.. "అప్పుడు రవీనా హీరోయిన్, కానీ ఇప్పుడు ఓ హీరోయిన్‌కు తల్లి అయ్యింది!" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

PREV
16
అక్షయ్ కుమార్

బాలీవుడ్ 'ఖిలాడీ' అక్షయ్ కుమార్, 'మస్త్ మస్త్' గర్ల్ రవీనా టండన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. జూన్ 11న ముంబైలో 'వెల్కమ్ టు ది జంగిల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్.. రవీనా గురించి చెప్పిన ఓ విషయం ఇప్పుడు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

26
రవీనా ప్రొఫెషనలిజం
సినిమా సెట్ అంటే గ్లామరే కాదు, సవాళ్లు కూడా ఉంటాయని ఈ సంఘటన నిరూపిస్తోంది. రవీనా ప్రొఫెషనలిజం గురించి మాట్లాడుతూ అక్షయ్ కుమార్ ఓ పాత కథను గుర్తుచేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో సూర్యాస్తమయం (Sunset) సీన్ తీయాల్సి వచ్చింది. వాళ్ల చేతిలో కేవలం 25 నుంచి 30 నిమిషాల టైమ్ మాత్రమే ఉంది. కానీ రవీనా 'గ్రీన్ రూమ్' సెట్‌కు చాలా దూరంలో ఉంది.
36
జనరేటర్ వ్యాన్ లోకి వెళ్లి కాస్ట్యూమ్స్ మార్చుకుని షూటింగ్‌కు రెడీ
రవీనా గ్రీన్ రూమ్‌కి వెళ్లి, బట్టలు మార్చుకుని వచ్చేసరికి సూర్యుడు అస్తమించేస్తాడు. అప్పుడు రవీనా చేసిన పనికి యూనిట్ మొత్తం షాక్ అయింది. టైమ్ వేస్ట్ చేయకుండా, ఆమె ఏమాత్రం మొహమాటపడకుండా సెట్ పక్కనే ఉన్న 'జనరేటర్ వ్యాన్' లోకి వెళ్లి క్షణాల్లో కాస్ట్యూమ్స్ మార్చుకుని షూటింగ్‌కు రెడీ అయ్యారట. "రవీనా డెడికేషన్ వల్లే ఆ రోజు ఆ సీన్ టైమ్‌కి పూర్తయింది" అని అక్షయ్ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
46
అప్పుడు హీరోయిన్, కానీ ఇప్పుడు ఓ హీరోయిన్‌కు తల్లి
ఇదే టైమ్‌లో అక్షయ్ కుమార్.. రవీనాను ఆటపట్టించడం మర్చిపోలేదు. "ఇన్నేళ్లలో రవీనాలో ఏం మారింది?" అని అడగ్గా.. "అప్పుడు రవీనా హీరోయిన్, కానీ ఇప్పుడు ఓ హీరోయిన్‌కు (రాశా థడాని) తల్లి అయ్యింది!" అంటూ జోక్ చేశారు. ఈ మాట వినగానే రవీనాతో పాటు స్టేజ్‌పై ఉన్నవాళ్లంతా నవ్వేశారు.
56
వెల్కమ్ టు ది జంగిల్
'వెల్కమ్ టు ది జంగిల్' బాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాల్లో ఒకటి. ఇందులో అక్షయ్, రవీనాతో పాటు సునీల్ శెట్టి, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సి, సంజయ్ దత్, జానీ లివర్ సహా దాదాపు 30 మందికి పైగా స్టార్స్ ఉన్నారు. ఫిరోజ్ నడియాడ్‌వాలా నిర్మించిన ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు.
66
జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

ఈ సినిమా జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కథ ప్రకారం, ఓ ఊరి ప్రజలు.. షూటింగ్ కోసం వచ్చిన వాళ్లను నిజమైన సైనికులుగా పొరబడతారు. అక్కడి నుంచి మొదలయ్యే కన్ఫ్యూజన్, కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని టాక్. మొత్తానికి, అక్షయ్-రవీనా జోడీని మళ్లీ తెరపై చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories