చెత్తగా ఉంది అని ఏఎన్నార్ రిజెక్ట్ చేసిన పాట, చిరంజీవి కెరీర్ లోనే పెద్ద హిట్ అయింది తెలుసా

Published : Feb 09, 2025, 08:58 AM IST

చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరొక హీరో దగ్గరకి వెళుతుంది. వేరే హీరోలు చేయాల్సిన కథని దర్శకులు మరో హీరోతో చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కథలు మాత్రమే కాదు పాటలు కూడా ఎక్స్ ఛేంజ్ అవుతుంటాయి.

PREV
15
చెత్తగా ఉంది అని ఏఎన్నార్ రిజెక్ట్ చేసిన పాట, చిరంజీవి కెరీర్ లోనే పెద్ద హిట్ అయింది తెలుసా
megastar chiranjeevi, Akkineni Nageswara Rao

చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరొక హీరో దగ్గరకి వెళుతుంది. వేరే హీరోలు చేయాల్సిన కథని దర్శకులు మరో హీరోతో చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కథలు మాత్రమే కాదు పాటలు కూడా ఎక్స్  ఛేంజ్  అవుతుంటాయి. రచయితలు రాసిన లిరిక్స్ బాగాలేకపోయినా, సిచ్యుయేషన్ కి తగ్గట్లుగా లేకపోయినా దర్శకులు, సంగీత దర్శకులు పక్కన పెట్టేస్తుంటారు. వేరే చిత్రాల్లో వాటిని వాడుకుంటుంటారు. 

25

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగేశ్వర రావు మధ్య సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. చిరంజీవికి 90 వ దశకం మహర్దశ అని చెప్పొచ్చు. లెజెండ్రీ లిరిసిస్ట్ వేటూరి సుందరరామ మూర్తి చాలా ఏళ్ళ క్రితమే అక్కినేని నాగేశ్వర రావు చిత్రం కోసం 'అబ్బనీ తీయని దెబ్బ' అనే సాంగ్ రాశారట. ఓ ఇంటర్వ్యూలో అక్కినేని పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ ఈ విషయాన్ని తెలిపారు. 

35

వేటూరి గారి రాసిన లిరిక్స్ అసభ్యంగా ఉన్నాయి, చెత్తగా ఉన్నాయి అని నాన్నగారు రిజెక్ట్ చేశారు. వేటూరి అదే పాటని కొంచెం మార్పులు చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఇళయరాజాకి ఇచ్చారట. ఆ సాంగ్ కి ఇళయరాజా అద్భుతమైన ట్యూన్ కట్టడం జరిగింది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ లో అది కూడా ఒకటిగా నిలిచింది. 

45

ఈ సాంగ్ లో శ్రీదేవి గ్లామర్, చిరంజీవితో ఆమె కలసి నాజూగ్గా వేసిన స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఈ పాటని అద్భుతంగా పాడారు. 

55

నాగార్జున రక్షణ చిత్రంలో సిరివెన్నెల రాసిన నీకు నాకు ఉన్న లింకు అనే పాటని మొదట విలన్ పై చిత్రీకరించాలి అనుకున్నారట. అసలు ఆ పాట వద్దని కొందరు చెప్పడంతో.. ఆ సాంగ్ ని తనకి ఇచ్చేయమని నా చిత్రంలో వాడుకుంటామని రాంగోపాల్ వర్మ అడిగిన సంగతిని కూడా అక్కినేని వెంకట్ గుర్తు చేసుకున్నారు. కానీ చివరికి ఆ పాటని రక్షణ చిత్రంలోనే నాగార్జున, సిల్క్ స్మితపై చిత్రీకరించారు. 

Read more Photos on
click me!

Recommended Stories