డైట్ విషయంలో కూడా నాగార్జునకి క్లారిటీ ఉంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినరట. లంచ్, డిన్నర్ మాత్రం నార్మల్ గా ఉంటుంది. సండే మాత్రం ఫుడ్ విషయంలో ఎలాంటి నియమాలు పెట్టుకోరట. ఇష్టమైన చికెన్, బిర్యానీ అన్ని తింటానని నాగార్జున తెలిపారు. సినిమాల విషయానికి వస్తే నాగార్జున ప్రస్తుతం ధనుష్ కుబేర, రజనీకాంత్ కూలీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.