సోషల్ మీడియాకు దూరమైన అఖిల్... మోనాల్ తో బ్రేకప్?... ఆ పోస్ట్ వెనుక కారణం అదేనా?

First Published Jun 25, 2021, 8:36 AM IST


బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సోషల్ మీడియాకు దూరం అయ్యారు. ఓ వారం తరువాత ఓ పోస్ట్ పెట్టిన అఖిల్... తాను కొంతకాలంగా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాని తెలియజేశారు. జీవితంలో అనుభవాల నుండి గుణపాఠం నేర్చుకున్నాని అంటున్న అఖిల్ పోస్ట్ పై కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

ఒక వేళ అఖిల్, మోనాల్ మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా, అఖిల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటని అందరూ భావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అఖిల్, మోనాల్ ప్రేమ వ్యవహారం తెలిసిందే.
undefined
హౌస్ లో ప్రేమ పక్షులుగా మెలిగారు వీరిద్దరూ. సీరియస్ లవర్స్ గా కొట్ట్టుకోవడం, తిట్టుకోవడం, ఏడవడం, హగ్గులు, కిస్సులతో వీరి బంధం సాగింది. అఖిల్...  నా ఫ్యామిలీ మెంబర్ లెక్క అని ఓపెన్ గా చెప్పిన మోనాల్, అతని కోసం త్యాగాలు కూడా చేసింది.
undefined
ఈ సీజన్లో అఖిల్, మోనాల్ ప్రేమ వ్యవహారమే షో హైలెట్. దీని కారణంగానే మోనాల్ కి ప్రేక్షకుల ఆదరణ లేకున్నా, హౌస్ నుండి ఎలిమినేట్ చేయకుండా కొనసాగించారన్న విమర్శలు కూడా వినిపించాయి.
undefined
ఇక హౌస్ లో సెన్సేషన్ కోసం, ప్రేక్షకుల అటెంషన్ కోసం ప్రేమికులుగా నటించారని కొందరు భావించారు. అయితే ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ, హౌస్ నుండి బయటకి కూడా వారు చాలా సన్నిహితంగా ఉంటున్నారు.
undefined
కెరీర్ కోసం హైదరాబాద్ లో మోనాల్ సెటిల్ కావడంతో వీలుదొరికినప్పుడల్లా కలవడం, విందులు, వినోదాలలో పాల్గొంటున్నారు ఈ జంట. ఇక మీ మధ్య ఉన్నది ఏమిటని ఓ ఇంటర్వ్యూలో అడుగగా.. నాట్ జస్ట్ ఫ్రెండ్స్.. అలా అని ప్రేమికులం కూడా కాదని కన్ఫ్యూజ్ చేశారు.
undefined
ఈ తరుణంలో అఖిల్ సోషల్ మీడియాకు దూరం కావడం, గడ్డు పరిస్థితుల నుండి పాఠాలు నేర్చుకున్నానని పోస్ట్ పెట్టడం బ్రేకప్ అనుమానాలకు దారితీసింది. మోనాల్ తో అఖిల్ విడిపోవడం వలనే ఆయన ఇలాంటి పోస్ట్ పెట్టారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
undefined
ఇక వీరిద్దరూ కలిసి తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. వీరి బంధం గతంలో మాదిరి బలంగా ఉందా లేక బీటలు వారిందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాలి.
undefined
click me!