పెద్ది రిలీజ్ డేట్ విషయంలో రూమర్స్ కొనసాగుతున్నాయి. క్లారిటీ లేక పోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. తాజాగా అఖిల్ లెనిన్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన నటించిన పెద్ది సినిమా విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పెద్ది పాన్ ఇండియా సినిమాగా 300 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందితోంది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 27నే ఈ చిత్రం రిలీజ్ కావలసింది. కానీ వాయిదా పడింది.
25
పెద్ది రిలీజ్ వాయిదా
ఏప్రిల్ 30కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా వాయిదా పడింది అని జూన్ 25న పెద్ది రిలీజ్ అవుతుందని అనధికార వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పెద్ది జూన్ 25న రావడం కూడా కష్టమే అని అంటున్నారు. దీనికి కారణం అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ చిత్రం.
35
అఖిల్ త్యాగం
లెనిన్ మూవీ ఇప్పటికే పెద్ది కోసం వాయిదా పడింది. అంటే చరణ్ కోసం అఖిల్ త్యాగం చేశాడు. ఈ విషయాన్ని లెనిన్ చిత్ర యూనిట్ ఓపెన్ గా చెప్పారు. తాజాగా లెనిని రిలీజ్ డేట్ లాక్ అయింది. జూన్ 26 ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
జూన్ 25న పెద్ది రిలీజ్ అయితే జూన్ 26న లెనిన్ చిత్రాన్ని ఎలా రిలీజ్ చేస్తారు ? అంటే పెద్ది వాయిదా పడుతున్నట్లు లెనిన్ చిత్ర యూనిట్ కి సమాచారం అందిందా ? అందుకే అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నారా అనే ప్రచారం టాలీవుడ్ లో జరుగుతోంది. ఒక వేళ పెద్ది అనుకున్నట్లుగానే జూన్ 25న వస్తే మరోసారి అఖిల్ త్యాగం చేయాల్సిందే.
55
ప్రమోషనల్ కంటెంట్ సూపర్ హిట్
మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. పెద్ది సినిమా విషయంలో రిలీజ్ అవుతున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ హిట్ అవుతోంది. రిలీజైన రెండు పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. కానీ ఈ వాయిదాలు అభిమానులని కలవరపెడుతున్నాయి.