Janaki Kalaganaledu: కాలేజీలో ఇల్లీగల్ గా అవి అమ్ముతున్న అఖిల్..అది తెలిసి జానకి షాక్..?

Published : Nov 03, 2022, 11:01 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 3 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
16
Janaki Kalaganaledu: కాలేజీలో ఇల్లీగల్ గా అవి అమ్ముతున్న అఖిల్..అది తెలిసి జానకి షాక్..?

ఈరోజు ఎపిసోడ్ లో అఖిల్ కాలేజీకి వెళ్తూ మత్తుగా తూగుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు అఖిల్ కాలేజీకి వెళ్లి అక్కడ తన ఫ్రెండ్స్ ని పిలిచి మాల్ ఉంది తీసుకుంటావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ ఇన్ని రోజులు మాల్ దొరకకా చాలా ఇబ్బంది పడ్డాం నువ్వు సప్లై చేస్తాను అంటే ఇంకా మాకు ఇంకేం కావాలి మామ అని అనడంతో ఈ విషయం ఎవరికీ తెలియకూడదు తెలిస్తే అందరం జైలుకు వెళ్తాము అని అంటాడు అఖిల్.

26

ఇంతలో పోలీసు వాళ్ళు రావడంతో అది చూసి దాక్కుంటారు అఖిల్ వాళ్ళ ఫ్రెండ్. అఖిల్ కాలేజ్ మొత్తం తిరుగుతూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆ మత్తుమందుని అమ్మి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే జానకి అటుగా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ అఖిల్ ఆ డబ్బులు చూసి ఆనంద పడుతూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి వచ్చి నువ్వు ఏదో అమ్మ కూడినది కాలేజీలో అమ్ముతున్నావు అని అందరికీ చెబుతాను అని అంటుంది. అప్పుడు అఖిల్ గట్టిగా అరగకు మాదురి ఈ విషయం అందరికి తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది అని అనగా ఆ అమ్మాయి మాత్రం ఈ విషయం ఇంతటితో వదిలేయను అఖిల్ నీ సంగతి చూస్తాను అని అక్కడి నుంచి వెళుతుంది.
 

36

అప్పుడు ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్తుండగా అఖిల్ ఆ అమ్మాయిని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం వినిపించుకోకుండా వెళుతూ ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి కాలేజ్ నుంచి బయటికి పరుగులు తీస్తుంది. కాలేజీ బయట జానకి రామచంద్ర కోసం ఎదురు చూస్తూ ఉండగా అఖిల్ కూడా ఆగు మాదిరి అంటూ ఆ అమ్మాయి వైపు పరుగులు తీయడం జానకి చూస్తుంది. ఏంటి అఖిల్ ఆ అమ్మాయి వైపు వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆగకపోతే నిజంగానే చంపేస్తా అని అంటాడు అఖిల్.
 

46

మాటలు విన్న జానకి షాక్ అవుతుంది. అఖిల్ ఆ అమ్మాయి వెంట పరిగెడుతూ ఉండగా జానకి వాళ్ళిద్దర్నీ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అఖిల్ పరిగెడుతూ వెళ్లి ఒక కట్టే తీసుకుని అమ్మాయికి విసరగా అది వెళ్లి ఆమెకు తగిలి కింద పడిపోతుంది. తర్వాత ఆ అమ్మాయి రక్తం కారుతున్న పట్టించుకోకుండా వెళ్తూ ఉండగా వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇంతలో ఆమె ఒకచోట పడిపోయి ఉండటం చూసి అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు.
 

56

అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోగా ఇంతలో అక్కడికి జానకి వచ్చి మాధురి అని టెన్షన్ పడుతూ ఆమెను నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది. మరొకవైపు అఖిల్ ఏమీ తెలియనట్టుగా  ఇంటికి వెళుతూ ఉంటాడు. ఇంతలోనే జ్ఞానాంబ దంపతులు ఎదురు కావడంతో అది చూసి అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత అఖిల్ టెన్షన్ పెడుతూ ఉండగా ఇంతలోనే గోవిందరాజులు పిలిచి ఎక్కడికి వెళ్లి వస్తున్నావు రా అని అడగడంతో ఇన్ని రోజులు తెలిసి తెలియకో మీ అందరిని బాధపెట్టాను నాన్న.
 

66

కానీ ఇప్పటినుంచి మారాను నాన్న నేను మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని చూస్తున్నాను అని వారి ముందు దొంగ ప్రేమ నటిస్తూ వారికి మాయమాటలు చెబుతూ ఉంటాడు. నేను మారాను నాన్న అనడంతో సరే వెళ్ళు అని అంటారు గోవిందరాజులు. తర్వాత ఆకి లోపలికి వెళ్ళగా అఖిల్ టెన్షన్ పడుతూ ఉండడంతో ఏమైంది అఖిల్ అని అడుగుతుంది జెస్సి. ఇప్పుడు అఖిల్ జెసికి దొంగ మాటలు మాయమాటలు చెబుతూ ఇన్ని రోజులు వేస్ట్ చేశాను ఇకపై చదువుపై ఉద్యోగంపై శ్రద్ధ పెట్టాలి అనుకుంటున్నాను అని అంటాడు. మరొకవైపు జానకి ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది.

click me!

Recommended Stories