Akhanda: అఖండ విజయోత్సవ జాతర.. పంచె కట్టులో బాలయ్య, ఎల్లో లెహంగాలో ప్రగ్యా మెరుపులు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 09, 2021, 08:52 PM ISTUpdated : Dec 09, 2021, 09:08 PM IST

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి మాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన మాస్ చిత్రం ఇదే. 

PREV
116
Akhanda: అఖండ విజయోత్సవ జాతర.. పంచె కట్టులో బాలయ్య, ఎల్లో లెహంగాలో ప్రగ్యా మెరుపులు

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి మాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన మాస్ చిత్రం ఇదే. 

 

216

ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. దీనితో నేడు వైజాగ్ లో అఖండ విజయోత్సవ జాతర పేరుతో సక్సెస్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. 

 

316

అఖండ విడుదలయ్యాక వరుసగా పెద్ద చిత్రాలన్నీ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. దీనితో ఇండస్ట్రీ మొత్తం అఖండ రిలీజ్ కోసం ఎదురు చూసింది. అంతా ఊహించినట్లుగానే  బాలయ్య సింహ గర్జనతో ఈ చిత్రం అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. 

416

థియేటర్స్ లో అఖండ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది.  బాలయ్యని మాస్ లుక్ లో ప్రజెంట్ చేయడంలో ప్రస్తుతం ఉన్న దర్శకులలో బోయపాటికి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. 

516

బాలకృష్ణ అఘోరగా అఖండ పాత్రలో విశ్వరూపం ప్రదర్శించారు. అభిమానులు కోరుకునే విధంగా బోయపాటి విందు భోజనం లాంటి మూవీ అందించారు. ఇక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్ కోరిక కూడా ఈ చిత్రంతో నెరవేరింది. 

 

616

అఖండ విజయోత్సవ జాతర ఈవెంట్ కి ఉదయభాను యాంకరింగ్ చేసింది. అభిమానుల కోలాహలం మధ్య ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. 

 

716

బాలయ్య పంచె కట్టులో రాజసం ఉట్టిపడేలా ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రగ్యా జైస్వాల్ ఎల్లో లెహంగాలో మెరుపులు మెరిపిస్తోంది. తన గ్లామర్ తో ఈవెంట్ కు కొత్త కళ తీసుకువచ్చింది ప్రగ్యా. 

816

ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. శ్రీకాంత్ విలన్ రోల్ లో మెరిశాడు. దర్శకుడు బోయపాటి, శ్రీకాంత్, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈవెంట్ లో మెరిశారు. 

916

అఖండ విజయోత్సవ జాతర వేడుక అభిమానులకు కనుల పండుగలా జరుగుతోంది. Pragya Jaiswal ఈ చిత్రంలో గ్లామర్ తో ఆకట్టుకుంది. సాంగ్స్ లో అవసరమైన మేరకు గ్లామర్ ఒలకబోసింది. నటన పరంగా కూడా మెప్పించింది. ఇక తమన్ బ్యాగ్రౌండ్ సంగీతంతో సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ మోతెక్కించాడు.

1016

అఖండ విజయంలో తమన్ సంగీతం ప్రభావం ఎంతైనా ఉందని అభిమానులు చెబుతున్నారు. బాలయ్య ఎనేర్జికి తగ్గట్లుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు తమన్. 

1116

ఇక అఖండ విజయోత్సవ వేడుకలో బాలయ్య ఓ బుల్లి అఘోరతో సరదాగా కనిపించారు. బాలయ్య పంచె కట్టులో ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 

1216

అఖండ విజయోత్సవ వేడుకకు లోకల్ గా ఉన్న టిడిపి లీడర్లు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

1316

బాలయ్య అభిమానులు కోరుకునే అంశాలని మాత్రం బోయపాటి అద్భుతంగా డీల్ చేస్తారు. అందువల్లే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించగా అఖండ విజయపథంలో దూసుకుపోతోంది.   

1416

అఖండ చిత్ర విజయం బోయపాటికి కూడా చాలా కీలకంగా మారింది. ఇంతకు ముందు బోయపాటి రాంచరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. 

1516

ఈ చిత్రంలో బాలయ్య మూడు గెటప్పుల్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అఖండ గెటప్ లో నెవర్ బిఫోర్ అనిపించే విధంగా బాలయ్య అదరగొట్టారు. 

 

1616

అఖండ చిత్ర విజయం త్వరలో విడుదల కాబోతున్న టాలీవుడ్ చిత్రాలకు కాన్ఫిడెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. త్వరలో పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories