ఫొటోలు షేర్ చేస్తూ సద్గురును కలవపడం పట్ల ఆమె అనూభూతిని తెలియజేసింది. ‘సద్గురుతో మహాశివరాత్రి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. నిజంగా ఇదొక అపురూపమైన అనుభవం. సాయంత్రపు శక్తివంతమైన ధ్యానాలు, ఆదియోగి (శివుడికి) చేసిన ప్రార్థనలు, అసాధారణమైన ప్రదర్శనలు, ఆనందకరమైన గానాలు నన్ను ఆకర్షించాయి. ముఖ్యం అక్కడి నృత్యం ఆరోజును మరింత గుర్తుండిపోయేలా చేసింది.