Ennenno janmala bandam: గృహప్రవేశం చేసిన యశోదర్, వేద.. ఆలోచనలో పడ్డ అభిమన్యు?

Navya G   | Asianet News
Published : Mar 04, 2022, 02:13 PM IST

Ennenno janmala bandam : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం ఇక ఈ సీరియల్ లో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
18
Ennenno janmala bandam: గృహప్రవేశం చేసిన యశోదర్, వేద.. ఆలోచనలో పడ్డ అభిమన్యు?

యశోధర్ వేద గృహప్రవేశం కోసం రెండు కుటుంబాల వారు సరదాగా మా ఇంట్లోకి అంటే మా ఇంట్లోకి అని పోట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా సులోచన, మాలిని లు ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ ఉంటారు. వేద, యశోదర్ లు కూడా నో టచ్చింగ్స్ అంటూ గొడవ పడతారు.
 

28

 యశోదర్ ఇంట్లో కి గృహ ప్రవేశం కోసం వెళ్తారు కానీ కాంచన ఆపి ఒకరి పేరు ఒకరు చెప్పాలి అంటుంది. దాంతో వేద యశోదర్ ముందు నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అనుకుంటారు ఖుషి చెప్పండి నాన్న అని అనడంతో యశోధర్ ముందుగా చెప్తాడు. వేద చాలా గౌరవంగా అందరి పేర్లను చెప్తుంది. ఇక ఖుషితో కలిసి యశోదర్ ఇంట్లోకి గృహప్రవేశం చేస్తారు.
 

38

 వేద పూజ గదిలో దీపాలను వెలిగించి ఖుషి వైపు చూసి సంతోష పడుతూ ఉంటుంది. మాలిని తన కొడుకు జీవితం చాలా బాగుండాలని కోరుకుంటుంది దేవుడిని. ఇక మాలిని వారి సాంప్రదాయాలతో వేద, యశోధర్ లను దగ్గర చేయాలని ప్రయత్నిస్తోంది. ఇక మాలిని వారి కుటుంబ ఆనవాయితీగా  వచ్చిన గాజులను వేద చేతులకు వేస్తుంది.
 

48

 రెండు కుటుంబాల వారు వేద, యశోధర్ లను ఓకే ఆకులు కలిసి తినెలా చేస్తారు. ఇక కుటుంబం కోసం  ఒకరినొకరు తిట్టుకుంటూనే తినిపించుకుంటూ ఉంటారు. ఇక వీరితో పాటు కుటుంబంలోని మిగతా వారు కూడా ఒకరికి ఒకరు తినిపించుకుంటారు.
 

58

 అభిమన్యు,మాళవిక పార్టీని ఎంజాయ్ చేసి ఇంటికి వస్తారు పెళ్లి ఆపినందుకు అభిమన్యు తెగ సంతోష పడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో ఖుషి, ఆయమ్మ కనిపించకపోవడంతో మాళవిక ఇంట్లో అంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ ఉంటారు అభిమన్యు,మాళవిక.
 

68

 ఖుషిని పంపించాల్సిన సమయం రావడంతో ఖుషి వెళ్ళను అని మారం చేయడంతో తొందరగా నిన్ను ఇంటికి తీసుకొస్తామని వేద యశోధర్ లు ఖుషికి నచ్చజెప్పి ఖుషికి సంతోషంగా ముద్దులు పెట్టి పంపుతారు. కానీ ఖుషి వెళుతూ ఉండటంతో వేద, యాష్ లు బాధపడుతూ ఉంటారు.
 

78

 ఆయమ్మ, ఖుషి ని ఇంటికి తీసుకొస్తుంది అభిమన్యు చూసి ఎక్కడికి వెళ్లారు అని అడగడంతో ఆయమ్మ ఖుషి కోసం కేక్ తినిపించడానికి తీసుకు వెళ్ళాను సార్ అని అబద్ధం చెప్తుంది. అభిమన్యు మాత్రం ఏదో మనకు తెలియకుండా జరుగుతుంది అని అనుమాన పడుతూ ఉంటాడు. మాళవిక అలాంటిదేమీ ఉండదు అని చెప్తుంది.
 

88

 ఇక కోర్టులో అభిమన్యు మాళవిక కూర్చుని ఉంటారు మెడలో తాళి తో వేద కనిపించి, యశోదర్ పక్కన కూర్చోవడంతో అభిమన్యు మాళవిక షాకవుతారు. మాళవిక వేదను పక్కకు తీసుకెళ్లి నన్ను ఇంత మోసం చేస్తావని వేద మీదకు చెయ్యి ఎత్తుతుంది. వేద మాళవిక చెయ్యి ని అడ్డుకొని కోపంగా చూస్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్లో  ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.

click me!

Recommended Stories