`అఖండ 2ః తాండవం` టీజర్‌.. శివుడిగా బాలయ్య విశ్వరూపం, ఇండియన్‌ బాక్సాఫీసుకి పూనకాలే

Published : Jun 09, 2025, 06:22 PM ISTUpdated : Jun 09, 2025, 08:17 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి టీజర్‌ విడుదలయ్యింది. ఇందులో శివుడిగా బాలయ్య రెచ్చిపోయారు. తాండవం చేస్తుండటం విశేషం.

PREV
15
`అఖండ` తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత బాలయ్య తన విజయ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య, బోయపాటి కలిసి `అఖండ 2ః తాండవం` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ నుంచి అదిరిపోయే టీజర్‌ని విడుదల చేసింది యూనిట్‌.

25
బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా `అఖండ 2ః తాండవం` టీజర్‌

మంగళవారం(జూన్ 10) బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలయ్య అభిమానులకు ముందుగానే ట్రీట్‌ ఇచ్చారు బోయపాటి. `అఖండ 2` నుంచి అదిరిపోయే టీజర్‌ ని విడుదల చేశారు. ఇందులో శివుడి అవతారంలో బాలయ్య విశ్వరూపం చూపించారు. విడుదలైన టీజర్‌ పూనకాలు తెప్పించేలా ఉంది.

35
శివుడి గెటప్‌లో రెచ్చిపోయిన బాలయ్య

`నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా?. అమాయకుల ప్రాణాలు తీస్తావా?` అంటూ బాలయ్య చెప్పే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ తో టీజర్ సాగింది. ఇందులో బాలయ్య రెచ్చిపోయారు. సీన్లకి తగ్గట్టుగా ఆయన చెప్పే డైలాగ్‌లో గూస్‌ బంప్స్ తెప్పిస్తున్నాయి.  కానీ బీజీఎం అంతగా ఎక్కేలా లేదు. థమన్‌ రేంజ్‌లో కనిపించలేదు. 

45
పూనకాలు తెప్పించేలా `అఖండ 2` టీజర్‌

టీజర్‌లో బాలయ్య యాక్షన్‌ వేరే లెవల్‌లో ఉంది. కాశ్మీర్ మంచు కొండల నేపథ్యంలో టీజర్‌ సాగింది. అందులో శివుడి గెటప్‌లో బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. త్రిశూలం పట్టుకుని అచ్చం ఆ పరమశివుడిని తలపించేలా ఉన్నారు. పవర్‌ ఫుల్‌ ఎంట్రీతో వాహ్‌ అనిపించారు. అంతేకాదు అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ విలన్లను ఒక్క దెబ్బతో మట్టికరిపించారు. 

55
దసరా కానుకగా `అఖండ 2ః తాండవం` సినిమా

బాలయ్యి విజృంభించిన తీరు నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఈ మూవీ `అఖండ`ని మించి ఉందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. టీజరే ఇలా ఉంటే, సినిమా ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ ఎప్పుడూ డిజప్పాయింట్‌ చేయలేదు. ఇప్పుడు కూడా డిజప్పాయింట్‌ చేయబోదని అర్థమవుతుంది. 

ఇక ఈ మూవీని పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. కనెక్ట్ అయితే మాత్రం బాలయ్య కెరీర్‌లోనే సంచలనాత్మక మూవీగా నిలవబోతుందని చెప్పొచ్చు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్‌ 25న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories