మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. రాఘవేంద్ర రావు, చిరంజీవి, శ్రీదేవి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంటుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.