ఐశ్వర్య రాజేశ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న డస్కీ బ్యూటీ!

First Published | Feb 5, 2023, 3:23 PM IST

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాశేశ్ (Aishwarya Rajesh) ప్రస్తుతం కోలీవుడ్ లో ఫుల్ బిజీ అయ్యారు. చేతినిండా సినిమాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ కోసం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 
 

ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే హీరోయిన్లలో తమిళ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ ఒకరు. గ్లామర్ షోకు చాలా దూరంగా ఉండే ఈ బ్యూటీ కేవలం పెర్ఫామెన్స్ తోనే తన సత్తా చాటుకుంది. హీరోయిన్ గా ఇప్పటికే తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. 
 

ఇటు తెలుగులోనూ ఆయా చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. ‘కౌసల్య క్రిష్ణమూర్తి’తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.
 


ఈఏడాది ఏకంగా తమిళం, మలయాళంలో డజన్ చిత్రాలతో అలరించబోతోంది ఐశ్వర్య రాజేశ్. ఇప్పటికే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ తమిళంలో విడుదలైన విషయం తెలిసిందే. మిగితా చిత్రాలు షూటింగ్ దశలో కొన్ని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మరిన్ని ఉన్నాయి. 
 

ఇన్ని చిత్రాల్లో నటిస్తున్న ఐశ్వర్య రాజేశ్ కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. హీరోయిన్ గానే కాకుండా.. ముఖ్య పాత్రల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుండటంతో చాలానే ఆఫర్లు అందుకుంటున్నారు. దీంతో షూటింగ్ లో బిజీ అవుతున్నారు.
 

మరోవైపు తన అభిమానులకు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తున్నారు హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ బ్యూటీ ట్రెడిషనల్ అందాలతోనే కట్టిపడేస్తున్నారు. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకున్నారు. 
 

వైట్ చుడీదార్ లో డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ మెరిసిపోతున్నారు. ఆకర్షించే రూపసౌందర్యం, మైమరిపించే చిరునవ్వుతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూనే.. అదిరిపోయే పోజులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేస్తోంది. 
 

Latest Videos

click me!