కొన్ని కాంబినేషన్లు వింటానికి విచిత్రంగా ఉంటాయి. కానీ క్రేజీగా ఉంటాయి. అసలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా అన్నట్టు ఉంటాయి. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్ పై సోషల్ మీడియాలో గట్టిగా చర్చ జరుగుతోంది. అదే సూపర్ స్టార్ మహేష్, ఐశ్వర్యరాయ్.
అవును వింటానికి విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం ప్రచారం ఉన్న క్రేజీ న్యూస్ ఇదే. సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఐశ్వర్యారాయ్ నటించబోతోందట. అది కూడా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో ఐష్ కనిపించబోతుందట. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూమర్ ఇదే.
28
కొన్ని వార్తలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇందులో ఎంత నిజం ఉంది? ఇది వాస్తవమేనా? అనే విషయాలతో సంబంధం లేకుండా... వీటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంటుంది. ఇప్పుడు మహేష,ఐశ్వర్య, రాజమౌళి కాంబినేషన్ సినిమా కూడా అలాంటిదే.
38
దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ మూవీలో ఐశ్వర్య లీడ్ రోల్ పోషిస్తుందని ఫిలింనగర్ టాక్. ఐశ్వర్యకు సంబంధించి మరో వార్త కూడా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఐశ్వర్యారాయ్ గురించి మరో వార్త ప్రచారంలో ఉంది. రజనీకాంత్, దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ఐశ్వర్య నటించబోతోందని సమాచారం.
48
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఐశ్యర్య నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పాత్ర ఏంటీ అన్నవిషయంలో మాత్రం ఎటువంటి రూమర్స్ లేవు.
58
అయితే ఐశ్వర్య రాయ్ తెలుగులో ఇంత వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆమెకు టాలీవుడ్ లో సినిమా చేయడ ఇష్టం ఉండదూ అని ప్రచారం ఉంది. ఆ మధ్య ఆచార్యలో చిరుకు జోడీగా నటించమని అడిగినా కూడా ఆమె చేయనని చెప్పిందట. మరి ఇప్పుడు ఈ సినిమాకు ఒప్పుకుంటుందా..?
68
గతంలో కూడా ఐష్ చేత తెలుగు సినిమా చేయించాలి అని చాలా మంది ట్రై చేశారు. కాని ఆమె రిజక్ట్ చేసింది. తమిళ సినిమాల్లో మాత్రం నటిస్తుంది ఐశ్వర్య. తెలుగు సినిమాలంటే చేయదు. గతంలో టాలీవుడ్ అంటే చిన్న చూపు ఉండేది. కాని ఇప్పుడు బాలీవుడ్ ను పక్కకు నెట్టి ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అని అనిపించుకుంది.
78
ఇక రాజమౌళి సినిమాలో పాత్ర అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి జక్కన్న అడిగితే.. బాలీవుడ్ లో స్టార్స్ కూడా క్యూ కడతారు. మరి ఈ సినిమాలో నిజంగా ఐష్ ను అనుకుంటున్నారా..? రాజమౌళి అడిగితే ఐశ్వర్యారాయ్ కాదంటుందా..? ఆమెను జక్కన్న ఎలా ఒప్పిస్తాడో చూడాలి.
88
ఇక పోతే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా తరువాత మహేష్.. రాజమౌళి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు.