భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న ఐశ్వర్య రాయ్..? అందుకే అప్పుడు అలా చేసిందా

Published : Sep 18, 2022, 01:53 PM IST

ఒక్కప్పటి అబ్బాయిల కలల రాకుమారి, మిస్ యూనివర్స్, ప్రస్తుతం బచ్చన్ ఫ్యామిలీ కోడలు ఐశ్వర్యా రాయ్ అరుదైన వ్యాధితో బాధపడుతుందా...? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. ఈ వ్యాధి కారణంగానే ఆమె పొన్నియన్ సెల్వన్ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిందా..? అసలేం జరుగుతోంది..? 

PREV
16
భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న ఐశ్వర్య రాయ్..? అందుకే అప్పుడు అలా చేసిందా

కోట్ల మంది కుర్రాళ్ల  కలలు రాకుమారిగా ఓ వెలుగు వెలిగింది మాజీ మిస్ యూనివర్స  ఐశ్వర్యారాయ్. బాలీవుడ్ తో పాట సౌత్ లో కూడా తన సత్తా చాటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ వయస్సు పెరుగుతున్నా.. నిగనిగలాడుతూ.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో అదరగొడుతుంది ఐశ్వర్యా రాయ్  

26

సౌత్ లో ఏ సినిమా చేసినా.. తెలుగులో మాత్రం డైరెక్ట్ సినిమా చేయనంటుంది ఐశ్వర్య.. తనకు హీరోయిన్ గా మంచి లైఫ్ ఇచ్చిన  తమిళ సినిమాల్లో మాత్రం అడగ్గానే ఒప్పేసుకుంటుంది. ఇక తమిళ్ నుంచి తెరకెక్కి...  2010లో వచ్చిన రోబో లో రజనీకాంత్ జోడీగా ఆడి పాడి అలరించింది. ఆతరువాత సౌత్ వైపుచూడని కూడా చూడలేదు బ్యూటీ. 

36

ఇక చాలా గ్యాప్ తరువాత ఐశ్వర్యరాయ్ తమిళ్ లో సినిమా చేస్తుంది. మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన  పోనియన్ సెల్వన్ మూవీలో నటించింది ఐశ్వర్య. ఈ సందర్భంగా భారీ ఎత్తును నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గోన్న ఐశ్వర్యా రాయ్.  మధ్యలోనే వెళ్లి పోయింది.  ఈ విషయంపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు ఓ భయంకరమైన జబ్బు ఉన్నట్టు న్యూస్ ట్రెండ్ అవుతోంది. 
 

46

చల్లని పదార్ధాలు తింటే.. చాలా మందికి కోల్డ్ వస్తుంది. ఇమ్ముకుంటుంది. కానీ ఐశ్వర్య రాయ్ కు ఉన్న జబ్బు ప్రకారం.  కూల్ వాటర్ తాగితే స్కిన్ ప్రాబ్లం వచ్చేస్తుందట. అంతేకాదు ఆమెకు బాడీ మొత్తం రెడ్ గా మారిపోయి ..ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయి భయంకరమైన అలర్జీతో బాధపడుతుందట. అందుకే ఇప్పటి వరకూ ఐశ్వర్యా రాయ్  కూల్ వాటర్ తాగకుండా జాగ్రత్త పడుతుందట. 

56

కూల్ వాటర్ తో పాటు  ఐస్ క్రీమ్స్..  కూల్ డ్రింక్స్..  కు కూడా దూరంగా ఉంటుందట ఐశ్వర్య. అయితే రీసెంట్ గా పొరపాటున పోనియన్ సెల్వన్ ట్రైలర్ ఈవెంట్లో ఆమె కూల్  వాటర్ తాగేయడంతో ఇక ఇబ్బంది స్టార్ట్ అయ్యిందని సమాచారం. అందుకే ఈవెంట్ లో ఉండలేక ఆమె మధ్యలోనే వెనుతిరిగింది అంటూ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. 

66

అంతేకాదు ఇప్పటికి కూడా ఐశ్వర్య ఎక్కడికైనా వెళ్తే తన మెడికల్ కిట్ మొత్తం తీసుకెళ్తుందట. మేకప్ కిట్ ఎంత ఇంపార్టెంట్ గా భావిస్తుందో.. ..మెడికల్ కిట్ కూడా అంతే జాగ్రత్తగా పెట్టుకుంటుందట. ఇంద అదాల రాశికి ఇలాంటి ఇబ్బంది ఏంటీ..? అంటూ ఆమె అభిమానలు బాధపడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories