బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ సినిమాలు చేసినా చేయకపోయినా, ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అందులో ఆమె చెప్పిన వివాదాస్పదమైన విషయం ఏంటంటే?
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ 2012లో 'డైలీ మెయిల్'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తన కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పదమైన కిస్ సీన్ గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడారు.
26
ఆ సీన్లు చేయాలంటే అస్సలు నచ్చదు..
కిస్ సీన్లలో నటించడం తనకు అస్సలు ఇష్టం లేదని ఐశ్వర్య ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. అందుకే చాలా సినిమాలను కూడా వదులుకున్నారట. ఆన్-స్క్రీన్ ఇంటిమేట్ సీన్లు చేయడం ఆమెకు ఎప్పుడూ కష్టమైన నిర్ణయమే.
36
ధూమ్ 2 మూవీలో కిస్ సీన్ వివాదం
‘ధూమ్ 2’లో హృతిక్ రోషన్‌తో చేసిన కిస్ సీన్ పెద్ద వివాదంగా మారింది. ‘నేను ధూమ్ 2లో అలా చేసినప్పుడు, అది దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా చాలా మంది నాకు లీగల్ నోటీసులు పంపారు’ అని ఐశ్వర్య చెప్పారు.
ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ.. ‘మీరు మాకు ఆదర్శం. మా అమ్మాయిలకు మీ ఉదాహరణే చెబుతాం. మీరు ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడిపారు. స్క్రీన్‌పై ఇలా చేయడానికి మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఎందుకు చేశారు?’ అని అభిమానులు పంపించిన నోటీసుల్లో రాసి ఉందని ఐశ్వర్య తెలిపారు. ఈ స్పందన చూసి ఆమె షాక్ అయ్యారట.
56
భారతీయ సంస్కృతి, సినిమాపై ఐశ్వర్య అభిప్రాయం
‘నేను కేవలం నా పని నేను చేస్తున్న ఒక నటిని... కానీ బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం భారతీయ సంస్కృతిలో ఇప్పటికీ అంత సాధారణం కాదు’ అని ఐశ్వర్య అన్నారు. హాలీవుడ్ సినిమాల్లో కిస్ సీన్లకు ఉన్న ఇంపార్టెన్స్, బాలీవుడ్ సినిమాల్లో పాటలకు ఉందని కూడా ఆమె అన్నారు.
66
ఐశ్వర్య రాయ్ 'ధూమ్ 2' సినిమా గురించి
‘ధూమ్ 2’ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించగా, సంజయ్ గధ్వి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భారతదేశంలో రూ. 81.01 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 149.08 కోట్లు వసూలు చేసింది.