Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?

Published : Aug 03, 2026, 06:47 PM IST

Agadha Trailer Review: ఎంఎస్‌ రాజు రూపొందించిన `అగధ` మూవీ ట్రైలర్‌ విడుదలయ్యింది. ఇది థ్రిలర్‌, హర్రర్‌, మిస్టరీయస్‌ ఎలిమెంట్లతో సాగుతూ, గూస్‌ బంమ్స్ క్రియేట్‌ చేస్తుంది.

PREV
14
అగధ మూవీ ట్రైలర్‌

ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు నిర్మాతగా సంచలనాలు సృష్టించారు. ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్‌ బస్టర్స్ అందించారు. నిర్మాతగా కొంత గ్యాప్‌ ఇచ్చి ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేస్తున్నారు. తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే `అగధ` అనే చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించింది. శ్రావణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ కేఆర్ సమర్పణలో, శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. తాజాగా సోమవారం `అగధ` ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

24
అగధ ట్రైలర్‌ రివ్యూ

`అగధ` ట్రైలర్‌ సింపుల్‌గా చెప్పాలంటే గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. మిస్టీరియస్‌ అంశాలు, థ్రిల్లర్‌, డివోషనల్‌, సెంటిమెంట్‌, ఎమోషన్స్ ఇలా అన్ని మేళవింపుగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. దీనికితోడు సూపర్‌నేచురల్‌ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా `అగధ... అది ఒక మూఢ నమ్మకమయితే కాదు. చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి` అనే ఒక్క డైలాగ్‌తోనే ‘అగధ’ ప్రపంచం ఎంత మిస్టీరియస్‌గా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పేశారు మేకర్స్. మిస్టరీ, దైవిక శక్తులు, అతీంద్రియ అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ మూవీ రెడీ అవుతుందని టీమ్‌ ట్రైలర్‌ ద్వారా చెప్పింది. ఇంకా ట్రైలర్‌ని చూస్తే, `హిమ ఆత్మహత్యకి కారణమేంటో అర్థమైందా బాబాయ్?` అనే ప్రశ్నతో మొదలైన మిస్టరీ... `నువ్వు, మహిమ కలిసి వెళ్లిన చోటేంటి? అక్కడేం చూశారు?` అనే మరో ప్రశ్నతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. అసలు మహిమకు ఏం జరిగింది? ఆమె మరణం వెనుక కారణమేంటి? వాళ్లు వెళ్లిన ఆ రహస్య ప్రదేశంలో ఏం చూశారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్కంఠను ట్రైలర్ మొదటి నుంచే క్రియేట్ చేస్తోంది.

34
అగధ ట్రైలర్‌లో హైలైట్స్

`మహిమా... నువ్విక్కడే వున్నావని తెలుసు.. ఏం జరిగిందో చెప్పు`అనే డైలాగ్‌తో కథలోని అతీంద్రియ కోణం తెరపైకి వస్తుంది. ఆ వెంటనే `మంత్ర, తంత్ర విద్యలకు అందని ఆ శక్తి గురించి నాకు తెలియాలి` అనే మాట వినిపించడంతో ఇది సాధారణ హారర్, థ్రిల్లర్ కాదనే విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అసలు ఆ శక్తి ఏంటి? దానికి ‘అగధ’ అనే పేరు ఎందుకు వచ్చింది? అనే ఆసక్తిని పెంచారు. `అగధా... నువ్వీ ప్రపంచాన్ని ఏలాలి.. ముల్లోకాల్నీ శాసించే శక్తివవ్వాలి` అనే డైలాగ్ రావడంతో ‘అగధ’ వెనుక ఉన్న శక్తి ఎంత ప్రమాదకరమైనదో అర్థమవుతోంది. `తనని చూశాక నా అంతర్ దృష్టికి అర్థమైంది ఒక్కటే దాని వక్రబుద్ధి` అనే హెచ్చరిక... `అగధతో పెట్టుకుంది మీ అక్క. దానికి మీ ఇద్దరి తలల్ని కానుకగా ఇస్తా` అనే బెదిరింపు... కథలోని సంఘర్షణను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆ శక్తి వెనుక కారణమేంటి? ఆ కుటుంబానికి ‘అగధ’కు ఉన్న సంబంధమేంటి? అనే మిస్టరీని మాత్రం మేకర్స్ ట్రైలర్‌లో రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డారు.

44
ఎం ఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా

అడవులు, పురాతన ఆలయాలు, రహస్య ప్రదేశాలు, మంత్ర తంత్రాలు, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక సంకేతాలతో ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌ను మిస్టిక్ వాతావరణంతో నింపారు దర్శకుడు ఎం.ఎస్. రాజు. విజువల్స్‌కు తోడు ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ ‘అగధ’ ప్రపంచాన్ని మరింత ప్రభావవంతంగా చూపించాయి. హీరో శ్రవణ్ రెడ్డి, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పాత్రలు కథలోని మిస్టరీకి కీలకంగా కనిపిస్తున్నాయి. భయం, ఆందోళన, నిజాన్ని తెలుసుకోవాలనే తపన వంటి భావోద్వేగాలను ఇద్దరూ సహజంగా పలికించారు. ఇతర కీలక పాత్రధారుల ప్రజెన్స్ కూడా ట్రైలర్‌కు అదనపు బలాన్ని తీసుకొచ్చింది. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్, భక్తి, అతీంద్రియ శక్తులు, వీటన్నింటినీ ఒకే కథలో మేళవిస్తూ దర్శకుడు ఎం.ఎస్. రాజు ‘అగధ’ను మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‌గా మార్చాడని అర్థమవుతుంది. ‘అగధ’ ఎవరు? ఆ శక్తి ఎలా పుట్టింది? మహిమకు ఏం జరిగింది? ఆ కుటుంబాన్నే అగధ ఎందుకు వెంటాడుతోంది? మహదేవి వారిని కాపాడగలదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. `చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన అగధ`కు... `సృష్టిని నడిపించే పంచభూతాల`కు మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోంది? ఆగస్టు 14న వెండితెరపై ఆ రహస్యం వీడనుంది. ట్రైలర్‌ మాత్రం అదిరిపోయింది. దర్శకుడు ఎంఎస్‌రాజు ప్రెస్‌ మీట్‌లో చెప్పినట్టుగానే స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌ ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories