మొన్న నయనతార.. నేడు కీర్తిసురేష్‌.. వ్యాక్సిన్‌ వివాదంలో ముద్దుగుమ్మలు..!

Published : May 24, 2021, 02:25 PM IST

గత వారం లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార వ్యాక్సిన్‌ వివాదంలో ఇరుక్కుని విమర్శలెదుర్కొంది. ఇప్పుడు `మహానటి` కీర్తిసురేష్‌ సైతం ఈ వ్యాక్సిన్‌ వివాదంలో ఇరుక్కుంది. వ్యాక్సిన్‌ వేయించుకుందా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

PREV
18
మొన్న నయనతార.. నేడు కీర్తిసురేష్‌.. వ్యాక్సిన్‌ వివాదంలో ముద్దుగుమ్మలు..!
18ఏళ్లు పై బడిన వారు కూడా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వాటిని అమలు చేయడం లేదు. కానీ తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుంది.

28
గత వారం లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార వ్యాక్సినేషన్‌ చేయించుకుంది. తమిళ సినీ పరిశ్రమ కచ్చితంగా వ్యాక్సినేషన్‌ చేయించుకుంటేనే షూటింగ్‌లకు, సినిమా కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

38
దీంతో నయనతార తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో కలిసి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ చేయించుకుంది. విఘ్నేష్‌ కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. తమ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని, మీరు కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

48
58
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో నయనతార వ్యాక్సినేషన్‌ చేసుకున్న తీరే వివాదాలకు కారణమైంది. నయనతార చేయికి నర్స్ ఇంజిక్షన్‌ లేకుండా కేవలం చేయితోనే ఇంజిక్షన్‌ ఇస్తున్నట్టుగా పోజ్‌ ఇచ్చింది. దీంతో ఇది పెద్ద దుమారం క్రియేట్‌ చేస్తుంది. నయనతార వ్యాక్సిన్‌ వేయించుకోలేదా? కేవలం యాక్షన్‌ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందా? అంటూ దుమ్మెత్తిపోతున్నారు నెటిజన్లు. ఇది పెద్ద వివాదంగా మారింది.

68
ఈ నేపథ్యంలో ఆదివారం కీర్తిసురేష్‌ సైతం ఫస్ట్ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని, మీరు కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ఇందులో ఆమెకి నర్స్ వ్యాక్సిన్‌ ఇస్తున్నప్పుడు ఇంజిక్షన్‌ కనిపించకుండా ఫోటో దిగింది.

78
నయనతారకి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా వ్యాక్సినేషన్‌ని కవర్‌ చేసుకుందా? నిజంగానే వ్యాక్సిన్‌ తీసుకుందా? లేక నయన్‌ మాదిరిగానే ఫోటోకి పోజులిచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి దీనిపై కీర్తి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

88
ప్రస్తుతం కీర్తిసురేష్‌ తెలుగులో `సర్కారు వారి పాట`,`గుడ్‌ లఖ్‌ సఖీ`, `మరక్కర్‌ః అరబికడలింటే సింహాం`, `అన్నాత్తే`, `సాని కాయిధమ్‌`, `వాశి` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. అలాగే నయనతార సైతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె `నెట్రికన్‌`, `అన్నాత్తే`, `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రానికి ఆమె ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories