అనసూయ యాంకర్‌గానే పాపులర్ అయ్యింది. `జబర్దస్త్` కి యాంకరింగ్ చేసిన తర్వాత మంచి గుర్తింపు పేరు, క్రేజ్, ఇమేజ్ వచ్చింది. బుల్లితెరపై ఈ బ్యూటీకి అందాలకు ఫుల్ డిమాండ్, క్రేజ్ ఉండేది. దీనికి తోడు అడపాదడపా సినిమాలు చేస్తూ వెండితెరపై మెరుస్తుంది. కానీ `రంగస్థలం` చిత్రం తర్వాత అనసూయ లెక్క మారిపోయింది. ఆమె రంగమ్మత్తగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత భారీ సినిమాల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. నెగటివ్ రోల్స్, ఐటెమ్ సాంగ్‌లు, బోల్డ్ రోల్స్ సైతం ఆమెకి ఆఫర్ చేస్తున్నారు. దీంతో నటిగా బిజీ అయ్యింది.