వర్షకు కరోనా అని తెలిసి టెన్షన్ పడ్డ బాయ్ ఫ్రెండ్ ఇమ్మానియేల్ ఏం చేశాడంటే!

First Published Apr 23, 2021, 5:08 PM IST

కరోనా సెకండ్ వేవ్ భారత్ కు చుక్కలు చూపిస్తుంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా... వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలు కరోనా బారినపడుతున్నారు. 
 

ఇటీవల జబర్దస్త్ వర్ష కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వర్ష తెలియజేశారు. ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసిన వర్ష, తనకు పరీక్షలలో కోవిడ్ అని నిర్ధారణ అయ్యింది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
undefined
వర్షకు కోవిడ్ సోకిందని తెలిసిన నాటి నుండి, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇమ్మానియేల్ ఆరోగ్యంపై నెటిజెన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షకు కరోనా నేపథ్యంలో ఇమ్మానియేల్ పరిస్థితి ఏంటి అంటూ.. కొందరు సెటైర్స్ విసురుతున్నారు.
undefined
సోషల్ మీడియాలో ఈ చర్చ ఎక్కువైపోయింది. దీనితో అందరి అనుమానాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు ఇమ్మానియేల్. సోషల్ మీడియా ద్వారా తనకు కోవిడ్ సోకలేదని, తాను ఆరోగ్యంగా ఉన్నట్లు వివరణ ఇచ్చాడు.  అది కూడా రుజువులతో పాటు నిర్ధారించాడు.
undefined
ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కోవిడ్ పరీక్షలు చేయించుకున్న రిపోర్ట్ చూపిస్తూ తనకు నెగిటివ్ వచ్చిందని ఆయన తెలియజేశాడు. దీనితో అందరి ప్రశ్నలకు సమాధానము దొరికినట్లు అయ్యింది.
undefined
జబర్దస్త్ వేదికపై రష్మీ, సుధీర్ ల జంట తరువాత ఆ స్థాయిలో పాప్యులర్ అయ్యారు ఇమ్మానియేల్, వర్ష. వీరిద్దరూ లవర్స్ అంటూ బుల్లితెర ప్రేక్షకులలో చర్చ నడుస్తుంది. వర్ష, ఇమ్మానియేల్ కూడా అలానే ప్రవర్తిస్తున్నారు.
undefined
వర్ష ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ ఇమేజ్ వారికి అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఆ రూమర్ తరువాతే ఈ ఇద్దరు పాపులర్ కావడం జరిగింది. జబర్దస్త్ స్కిట్స్ తో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలలో ఇమ్మానియేల్, వర్ష కలిసి సందడి చేస్తున్నారు.
undefined
మరి బుల్లితెర ప్రేమికులుగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ జంట ప్రయాణం ఎలా ముగుస్తుందో చూడాలి. ఇక వర్ష కోవిడ్ నుండి కోలుకొనే వరకు కార్యక్రమాల్లో పాల్గొనే వీలు లేదు.
undefined
click me!