సోనూసూద్ దాతృత్వం.. కోవిడ్ రోగిని ఎయిర్ అంబులెన్స్ లో నాగ్ పూర్ నుంచి హైదరాబాద్‌కు.. !

First Published Apr 23, 2021, 3:59 PM IST

సోనూసూద్ ప్రస్తుతం కోవిడ్ బారిన పడి హోం క్వారంటైన్ లో ఉంటూ కూడా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ రోగికి సహాయహస్తం అందించాడు. ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు.

undefined

భారతి అనే అమ్మాయి కోవిడ్ బారిన పడిన.. ఇన్ఫెక్షన్ తో 85-90% ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని చెప్పారు.
undefined
అంతే కాదు ఆ చికిత్స హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. వెంటనే సోనూసూద్ అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపారు.
undefined
దీనికోసం ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఈ చికిత్సలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగిస్తారు. అయితే ఈ ECMO చికిత్స చేయాలంటే.. దానికి సంబంధించిన మొత్తం సెటప్ తో.. 6 మంది వైద్యులు హైదరాబాద్ నుండి ఒక రోజు ముందుగానే సిద్ధం అవ్వాల్సి ఉంటుంది.
undefined
సోనూసూద్ ఈ ఏర్పాట్లన్నీ చేసి.. భారతిని హైదరాబాద్ కు చేర్చడానికి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు చేరుకున్న భారతికి చికిత్స మొదలయ్యింది.
undefined
సోనూసూద్ ఈ ఏర్పాట్లన్నీ చేసి.. భారతిని హైదరాబాద్ కు చేర్చడానికి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు చేరుకున్న భారతికి చికిత్స మొదలయ్యింది.
undefined
దీని గురించి సోనుసూద్ మాట్లాడుతూ, “ఆమెకు నయమయ్యే అవకాశాలు 20 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితేనేం ఆమె 25 ఏళ్ల యువతి, ఈ యుద్దాన్ని గెలుస్తుంది. అందుకే మేము ఛాన్స్ తీసుకోవాలనుకున్నాం. వెంటనే ఎయిర్ అబులెన్సు బుక్ చేసాం. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స బాగా జరుగుతోంది, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది. ” అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
undefined
కోవిడ్ -19 మహహ్మారి సమయంలో ఒకరిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొదటిది. భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి. భారతి కోలుకోవాలని ఆమె కుటుంబంతో పాటు.. అనేకమంది ప్రార్థనలు చేస్తున్నారు.

సోను సూద్ కు కరోనా పాజిటివ్ అని ఇటీవలే తేలింది. ఆయన హోం క్వారంటైన్ లో ఉంటూ కూడా ఇలా సాయం చేయడానికి ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి సంచలనంగా మారింది. ఆయన గొప్ప మనసుకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

click me!