‘బాహుబలి’ తర్వాత డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ ఎంతలా పెరిగిందో తెలిసిన విషయమే. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగింది. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ లో మనోడికి తారాస్థాయిలో ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ సినిమాలకు మంచి డిమాండ్ కూడా వచ్చింది.
‘సాహో’తో యాక్షన్ హీరోగానూ మారిపోయారు. దీంతో భారీ ప్రాజెక్టులు డార్లింగ్ లైనప్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’తో నెక్ట్స్ లెవల్ క్రేజ్ ను సంపాదించారు. ఈ చిత్రం విడుదల తర్వాత అక్కడి హీరోలకు సవాల్ గా మారాడు.
జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘ఆదిపురుష్’ మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. రిలీజ్ కు ముందూ విమర్శలు, వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో వివాదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అయినా, కేవలం ప్రభాస్ ఉన్నాడనే ప్రేక్షకులకు Adipurushని ఆదరిస్తున్నారు. ఒక్క డార్లింగ్ వల్లే థియేటర్లు నిండిపోయాయని అభిప్రాయపడుతున్నారు. సినిమా టాక్ అటుంచితే.. కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ములేపుతోంది. నాలుగు రోజుల్లోనే రూ.410 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ వల్లే ఇదంతా సాధ్యమైందంటున్నారు కొందరు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోలకూ ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ముప్పు తప్పదంటున్నారు. అక్కడ డార్లింగ్ ఊచకోత షురూ అయినట్టేనని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో గట్టి పోటీగా ఏర్పడ్డారనే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇక సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాలతో ప్రభాస్ రేంజ్ ఎలా ఉండబోతోందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మూడు ప్రాజెక్ట్ లపై ఊహకందని అంచనాలైతే ఏర్పడ్డాయి. ‘ఆదిపురుష్’ కాస్తా డిజపాయింట్ చేసిందంటున్న వారు.. నెక్ట్స్ ‘సలార్’తో డార్లింగ్ ఊచకోత తప్పదని గట్టిగా నమ్ముతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.