అడల్ట్ కంటెంట్‌ సినిమా.. తెలుగులో చీకట్లో చితక్కొట్టుడు.. సీక్వెల్ లాగే... (చూడండి)

First Published Oct 10, 2020, 12:53 PM IST

`ఇరండామ్‌ కుతు` పేరుతో తమిళంలో రూపొందుతున్న సినిమా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాని బ్యాన్‌ చేయాలని తమిళనాడుకి చెందిన పలు పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదని చెబుతున్నారు. మరి అందుకు కారణమేంటనేది చూస్తే. 

సంతోష్‌ పి.జయకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా ఫస్ట్ లుక్‌ టీజర్‌ విడుదలైంది. పోస్టర్‌, టీజర్‌ చాలా అసభ్యకరంగా ఉన్నాయి. పడకగదిసన్నివేశాలు వికృతంగా ఉన్నాయని తమిళనాడుకి చెందిన వివిధ పార్టీల నాయకుడు ఆరోపిస్తున్నారు.
undefined
తమిళ సినిమాల్లో ఇలాంటి అసహ్యకరమైన సినిమాలు కూడా వస్తున్నందుకు బాధగా ఉందని, వీటిని పిల్లలు చూసి చెడిపోయే ప్రమాదం ఉందని, అంతటి విషపూరితంగాఉందని ఆరోపిస్తున్నారు. అశ్లీల దృశ్యాలు, డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో కూడిన ఈ సినిమాని ఆపేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు చెన్నై పోలీస్‌ కమిషనర్‌కిఫిర్యాదు చేశారు.
undefined
అంతేకాదు ఈ సినిమాని తమిళనాడు ప్రభుత్వం బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల థియేటర్‌ ఓపెనింగ్‌కి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న విషయంతెలిసిందే. ఈ నెల 15 నుంచి అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇదే రోజు ఈ సినిమాని విడుదలకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. దీంతో తమిళనాడుకు చెందిన పనంగట్టుఫోర్స్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
undefined
ఈ నెల 15 నుంచి అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇదే రోజు ఈ సినిమాని విడుదలకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. దీంతో తమిళనాడుకు చెందిన పనంగట్టుఫోర్స్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
undefined
ఇదిలా ఉంటే తెలుగులో వచ్చిన `చీకటి గదిలో చితక్కొటుడు` వంటి బూతు సినిమాని రూపొందించిన దర్శకుడే తాజాగా `ఇరండామ్‌ కుతు` చిత్రాన్ని రూపొందించడం విశేషం. తెలుగులోనే ఆ సినిమాపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు `చీకటి గదిలో చితక్కొట్టుడు`కి సీక్వెల్‌గా దీన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాపై రాజకీయ నాయకులే కాదు,సినీ వర్గాల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాపై తాజాగా దర్శక, నిర్మాత, నటుడు భారతీరాజా స్పందించారు. విమర్శలు గుప్పించారు.
undefined
click me!