రామ్ చరణ్ హీరోగా 1000 కోట్లతో.. ధురంధర్ డైరెక్టర్ సినిమా? కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు, నిజమెంత?

Published : Mar 24, 2026, 07:53 AM IST

ధురంధర్ సినిమాతో రచ్చ రచ్చ చేశాడు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్. ఇక ఈసారి టాలీవుడ్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట ఆదిత్య.. 1000 కోట్లతో అతను చేయబోయే సినిమా ఏంటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.

PREV
14
ధురంధర్ తో సత్తాచాటిన ఆదిత్య ధర్..

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు ఆదిత్య ధర్ పేరుక మారుమోగిపోతోంది. ఆయన తీసిన ధురందర్ సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ఆయన, తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’తో మరోసారి తన సత్తా చాటాడు. 

డైరెక్టర్ గా బాలీవుడ్ ఖ్యాతిని మరితగా పెంచాడు ఆదిత్య. తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ధురంధర్ రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ.2000 కోట్ల మార్కును సులభంగా దాటే అవకాశం ఉందని అంచన.

24
డ్రీమ్ ప్రాజెక్ట్ పనుల్లో ఆదిత్య ధర్..

ఈ విజయంతో ఆదిత్య ధర్ స్థాయి మరింత పెరిగింది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ‘ది ఇమ్మోర్టల్ అశ్వథామ’ సినిమాను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఒక భారీ మైథో-సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఈసినిమాను ఆదిత్య టాలీవుడ్ స్టార్ హీరోతో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.

34
1000 కోట్ల భారీ ప్రాజెక్ట్..

భారతీయ పురాణాల్లో అశ్వథామ పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ పాత్రను ఆధునిక కాలానికి అనుగుణంగా, వినూత్నంగా చూపించేందుకు ఆదిత్య ధర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

44
రామ్ చరణ్ హీరోగా చేయబోతున్నారా?

ఈ పాన్-ఇండియా చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేదా ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్‌లలో ఒకరు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించే అవకాశం ఉంది.

ఈ ఇద్దరిలో ఎవరు అశ్వథామ పాత్రను పోషించినా, అది బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద విజయాన్ని సాధించే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అశ్వథామ చాలా హైట్ అంటాడని పురాణాలు చెపుతున్నాయి. ఈలెక్కన ఈ ఇద్దరు హీరోలతో ఆ పాత్ర ఎలా చేయిస్తాడు.. అసలు ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories