బాలకృష్ణతో నటించమని హీరోయిన్ ని అడిగిన సీనియర్ ఎన్టీఆర్..కుదరదని చెప్పేసింది, ఎందుకో తెలుసా

చిత్ర పరిశ్రమలో గ్లామరస్ హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. సినిమాల్లో గ్లామర్ అనేది కూడా కీలకంగా మారిపోయింది. కానీ గ్లామర్ తో సంబంధం లేకుండా హోమ్లీ ఇమేజ్ తో రాణించిన హీరోయిన్లని వేళ్ళపై లెక్కపెట్టొచ్చు.

చిత్ర పరిశ్రమలో గ్లామరస్ హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. సినిమాల్లో గ్లామర్ అనేది కూడా కీలకంగా మారిపోయింది. కానీ గ్లామర్ తో సంబంధం లేకుండా హోమ్లీ ఇమేజ్ తో రాణించిన హీరోయిన్లని వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో హీరోయిన్ యమున ఒకరు. 90 వ దశకంలో యమున ఎమోషనల్ కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతంగా నటించింది. 

మామగారు లాంటి చిత్రాల్లో ఆమె నటనకి ప్రశంసలు దక్కాయి. యమున.. రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ లాంటి హీరోలతో నటించింది. కానీ స్టార్ హీరోలతో ఆమె నటించలేకపోయింది. అవకాశాలు రాక కాదు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే అని యమున ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పట్లో ఆమె చాలా అమాయకంగా ఉండేదట. 


Also Read: ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావుని డామినేట్ చేసిన నటి, సావిత్రి కాదు..చనిపోతే ఒక్కరు కూడా వెళ్ళలేదు


దీనితో ఎలాంటి చిత్రాల్లో నటించాలి, ఏ దర్శకుల చిత్రాలు ఎంచుకోవాలి అనే ఆలోచన ఉండేది కాదట. డేట్లు ఎలా అడ్జెస్ట్ చేసుకోవాలి అనే విషయం కూడా తెలిసేది కాదట. హీరోయిన్ పాత్ర అని చెబితే చేసేదాన్ని. కాస్త ప్రాధాన్యత తక్కువగా ఉండి.. మంచి డైరెక్టర్ అయినపప్టికీ ఒప్పుకునేదాన్ని కాదు. అది నా అమాయకత్వం. 

Actress Yamuna

ఒకసారి నా గురించి సీనియర్ ఎన్టీఆర్ కూడా విన్నారట. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోంది అని ఎన్టీఆర్ కి చెప్పారట. దీనితో బాలకృష్ణ సినిమాలో నటించమని చెప్పండి అని ఎన్టీఆర్ అన్నారట. ఆ సమయంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాను. ఎంత ప్రయత్నించినా బాలయ్యతో నటించడం కుదర్లేదు. దీనితో డేట్లు అడ్జెస్ట్ కాలేదు అని చెప్పేసినట్లు యమున పేర్కొంది. 

అదే విధంగా మోహన్ బాబు చిత్రం కూడా అవకాశం చేజార్చుకున్నా అని తెలిపింది. మౌన పోరాటం, ఎర్రమందారం లాంటి చిత్రాలు నాకు ఒక మంచి అనుభూతి. ఇప్పుడు అలాంటి పాత్రల్లో నటించే హీరోయిన్లు లేరు అని యమున పేర్కొన్నారు. 

Latest Videos

click me!