విక్టరీ వెంకటేష్ కి చెల్లిగా..
ఆ తర్వాత 'కలకలప్పు', 'చొక్కా తంగం', 'వికడన్', 'సూర్యన్', 'తెన్రల్', 'కోవై బ్రదర్స్', 'అడైకళం', 'మణికంఠ', 'రసిగర్ మండ్రం', 'భాగ్యలక్ష్మి' వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. చివరిగా అజిత్ నటించిన 'వలిమై' చిత్రంలో యంగ్ సుమిత్ర పాత్రలో కనిపించారు. 'చొక్కా తంగం', 'కోవై బ్రదర్స్' సినిమాలతో ఆమె అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో కూడా ఉమా శంకరి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ లక్ష్మీలో ఆయన చెల్లి పాత్రలో ఉమా శంకరి నటించారు. ఈ మూవీలో ఆమెది ప్రాధాన్యం ఉన్న పాత్రే. ఆమ్మో బొమ్మ, కల్యాణ రాముడు, నవ్వుతూ బతకాలిరా లాంటి తెలుగు సినిమాలలో ఉమా సత్తా చాటారు. 2006లో పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.