కార్తికేయ 2 రిలీజ్ కి ముందు ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో దిల్ రాజు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో నటి తులసి కామెంట్స్ మరోసారి దుమారం రేపుతున్నాయి. కార్తికేయ, కార్తికేయ2 చిత్రాల్లో తులసి నిఖిల్ తల్లి పాత్రలో నటించారు.