మోడ్రన్ లుక్ లో మెరిసిన త్రిష .. అందంతో అట్రాక్ట్ చేస్తున్న కుందవై.. ఇలా స్పందిస్తున్న ఫ్యాన్స్..

First Published | Apr 29, 2023, 5:06 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్  (Trisha Krishnan) పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మోడ్రన్ లుక్ లో ఆకట్టుకుంది. ఆ పిక్స్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది. 
 

స్టార్ హీరోయిన్ గా దక్షిణాది ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది త్రిష. 20 ఏండ్లకు పైగా తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ అలరించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈక్రమంలో ‘పొన్నియిన్ సెల్వన్’తో  ‘కుందవై’గా మరింత క్రేజ్ దక్కించుకుంది.
 

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ గతేడాది మొదటి భాగం విడుదై హిట్ గా నిలించింది. ఏప్రిల్ 28న  PS2 సైతం విడుదలై బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. దీంతో త్రిష అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 


కాగా, పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో త్రిష ట్రెడిషనల్ లుక్స్ లో అదరగొట్టింది.చీరకట్టులో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. అయితే నార్త్ సైడ్ ప్రమోషన్స్ లో త్రిష మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఆ ఫొటోలను అభిమానులతో తాజాగా పంచుకుంది. తన స్టైలిష్ లుక్ తో కట్టిపడేసింది.

రెడ్ అండ్ వైట్ మినీ  చెక్స్ సూట్ లో త్రిష ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. స్టన్నింగ్ ఫోజులతో ఆకట్టుకుంది. మరికొద్ది నెలల్లో నాలుగు పదుల వయస్సుకు చేరుకుంటున్నా చెక్కు చెదరని అందంతో అట్రాక్ట్ చేసింది. బ్యూటీఫుల్ స్మైల్, మత్తు కళ్లతో మైమరిపించింది. ఆ ఫొటోలను  చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రమోషన్స్ లో త్రిషనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. సౌత్ క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కుందవై అభిమానులు నెట్టింట రచ్చ చ ేస్తున్నారు. మరోవైపు పీఎస్2 రిలీజ్ సందర్భంగా ‘కుందవై’ ఫొటోలను ముద్రించిన టీషర్ట్స్ ను ధరించి త్రిషపై అభిమానాన్ని చాటుకున్నారు.  ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ఇక త్రిష నటిస్తున్న మరో క్రేజీ చిత్రం LEO గురించి కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత త్రిష, విజయ్ దళపతి సరసన నటిస్తుండటం విశేషంగా మారింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ శరవేగంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘రామ్ : పార్ట్ 1’, ‘లియో’, ‘ది రోడ్’, ‘సతురంగ వెట్టై 2’లో నటిస్తూ బిజీగా ఉంది. 

Latest Videos

click me!