స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ శారీలో త్రిష గ్లామర్ మెరుపులు.. చూపులత్తోనే మత్తెక్కిస్తున్న సీనియర్ భామ..

First Published | Apr 23, 2023, 6:36 PM IST

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్  (Trisha Krishnan) చీరకట్టులో అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా సీనియర్ భామా ట్రాన్స్ ఫరెంట్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. టాలీవుడ్ లో కొన్నేండ్ పాటు ఊపూపింది ఈ ముద్దుగుమ్మ. బడా హీరోల  సరసన నటించిన త్రిష ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా గట్టిగానే సంపాదించుకుంది.
 

తమిళ ఇండస్ట్రీకి చెందిన త్రిష ‘వర్షం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది అంతకంటే ముందే ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంలో మెరిసింది. ప్రభాస్ తో నటించిన ‘వర్షం’ మాత్రం మంచి హిట్ ను సాధించి పెట్టింది.  ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో త్రిషకు మంచి ఆఫర్లు దక్కాయి. 
 


చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య, ఎన్టీఆర్, సిద్ధార్థ్, మహేశ్ బాబు, రవితేజ, నాగార్జున, వెంకటేశ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుండిపోయే చిత్రాలను అందించింది. తన అందం, అభినయంతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం త్రిష సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. 

తమిళ బాహుబలిగా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ ద్వితీయ భాగం విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రస్తుతం ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటింది. అయితే తాజాగా బెంగళూరులో PS2 ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి ఈవెంట్ లో చీరకట్టులో మెరిసింది. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

త్రిష లేటెస్ట్ గా ట్రాన్స్ ఫరెంట్ శారీలో, రెడ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసింది. నాలుగు పదుల వయస్సు వచ్చినా చీరకట్టులో ఏమాత్రం చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంది.మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ వచ్చింది. ఫొటోలకు మైమరిచిపోయేలా ఫోజులు కూడా ఇచ్చింది.
 

త్రిష లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. తాజా పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28న విడుదల కానుంది. త్రిష మరోవైపు విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబోలోని Leoలోనూ నటిస్తోంది.
 

Latest Videos

click me!