పింక్ డ్రెస్ లో మైమరిపిస్తున్న అమృత అయ్యర్.. అయస్కాంతంలా ఆకర్షిస్తున్న ‘హను-మాన్’ బ్యూటీ..

First Published | Apr 23, 2023, 6:01 PM IST

యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ (Amritha Aiyer) టాలీవుడ్ లో సైలెంట్ గా ఆఫర్లను దక్కించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం తేజ సజ్జ సరసన ‘హను-మాన్’లో నటిస్తోంది.  ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.
 

బెంగళూరుకు చెందిన అమృత అయ్యర్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే సెటిల్ అయినట్టు కనిపిస్తోంది.  తమిళంలో కొన్నేండ్ల పాటు సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ విజయ్ దళపతి ‘బిజిల్’ చిత్రంతో ఫుట్ బాల్ కెప్టెన్ గా తన పెర్ఫామెన్స్ తో  అదరగొట్టింది. ఈ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది.
 

తెలుగులోకి అమృత అయ్యర్ ‘రెడ్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.  ఈ చిత్రంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  కానీ తర్వాత వచ్చిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’చిత్రంతో హీరోయిన్ గా ఆకట్టుకుంది. మంచి గుర్తింపు కూడా దక్కింది. వెంటనే ‘అర్జున ఫాల్గుణ’తోనూ అలరించింది. 


ప్రపంచ వ్యాప్తంగా 11 భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘హను-మాన్’(HanuMan)లో నటిస్తోంది.  యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) సరసన ఆడిపాడనుంది. క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ దక్కుతోంది.  దీంతో అమృత అయ్యర్ కు మంచి హిట్ ఖాయమంటున్నారు.
 

ఒక్క హిట్ పడితే అమృత అయ్యర్ కూడా క్రేజీ  హీరోయిన్ గా మారిపోయే అవకాశం ఉందంటున్నారు. దీంతో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ అమృత చాలా యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

ఈ సందర్బంగా బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది. నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ అదరగొడుతోంది. తాజాగా యంగ్ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో ఫొటోషూట్ చేసి, ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

తాజాగా అమృత అయ్యర్ పంచుకున్న ఫొటోల్లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. పింక్ ట్రెడిషనల్ వేర్ లో హోయలు పోయింది.  ఈ సందర్భంగా ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చిస్తూ కట్టిపడేస్తోంది. గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంది. యంగ్ బ్యూటీ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు కూడా పెడుతున్నారు. 
 

Latest Videos

click me!