మరోసారి నటి సురేఖ వాణి ఫైర్‌.. అలాంటి వారిని నమ్మొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు..

First Published | Mar 29, 2021, 8:55 AM IST

నటి సురేఖ వాణి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన రెండో పెళ్లిపై వస్తోన్న వార్తలను ఖండించారు. తాజాగా మరోసారి ఫైర్‌ అయ్యారు. అలాంటి మనుషులను దూరం పెట్టండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 
 

హీరోహీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగానో కనిపిస్తుంది. పాత్ర ఏదైనా తెరపై తన నటనతో రక్తికట్టించడంలో సురేఖ వాణి తోపు అని చెప్పొచ్చు.
సినిమాల్లో చాలా వరకు సాంప్రదాయబద్దమైన పాత్రల్లో, చీరకట్టులో కనిపిస్తుంది సురేఖ వాణి. ట్రెడిషనల్‌ లుక్‌కి కేరాఫ్‌ గా నిలుస్తుంది. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం ఆమె లైఫ్‌ స్టయిల్‌ చూస్తే షాక్‌ అవుతారు.

సురేఖ వాణి టాలీవుడ్‌లో లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అనేక సినిమాల్లో బ్రహ్మానందం సరసన నటించి కామెడీని పండించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకూడా బాగా వర్కౌట్‌ అవుతుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది.
తన కూతురులో కలిసి పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాలు ఆరబోతుస్తుంటుంది. తొడ అందాలను, నడుమందాలను, అవసరమైతే కాస్త ఎద అందాలను చూపించిన సందర్బాలు చాలానే ఉన్నాయి.
ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయి, చివరికి ట్రోల్‌ అవ్వడం కూడా జరిగింది. వీటిపై ఆమె ఘాటుగానే స్పందిస్తుంది. తమ డ్రెస్సుపై విమర్శించేందుకు మీరు ఎవరు అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్స్ ఇచ్చింది. ట్రోలర్స్ గట్టి బుద్ది చెబుతుంది.
పెళ్లీడుకొచ్చిన కూతురుతో కలిసి సురేఖ వాణి పార్టీల్లో ఎంజాయ్‌ చేయడం, ఫంక్షన్స్ లో సందడి చేయడం, స్విమ్మింగ్‌ ఫూల్స్ లో జలకాలాడటం చేసిన ఫోటోలు సైతం సోషల్‌ మీడియాని ఊపేశాయి.
ఇదిలా ఉంటే ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపించాయి. దీనిపై కూతురు సుప్రిత స్పందించి ఘాటుగా బదులిచ్చింది. మీడియాపై ఓ రేంజ్‌లో ఎగిరిపడింది. వాస్తవాలు రాయండి అంటూ ఫైర్‌ అయ్యింది. ఈ విషయంలో సురేఖ కూడా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. కానీ ఉన్నట్టుండి మరోసారి ఫైర్‌ అయ్యింది సురేఖ వాణి. తనజీవితంలోని జరిగిన చేదు విషయాలను పరోక్షంగా పంచుకుంది. ఆవేదన వ్యక్తం చేసింది.
`నకిలీ మనుషులను దూరం పెట్టండి. ఒట్టి మాటలను నమ్మకండి. అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా, సుఖంగా ఉంటుంది` అని సోషల్‌ మీడియాలో పేర్కొంది సురేఖ. దీంతో ఇది ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యనించిందనేది సస్పెన్స్ గా మారింది.
తన జీవితంలో తగిలిన ఎదురు దెబ్బని ఉద్దేశించి ఆమె కామెంట్‌ చేసిందని అనుకుంటున్నారు. మరిఆ విషయం సురేఖ చెప్పకపోవడంతో ఎవరి గురించి ఈ పోస్ట్ పెట్టిందనేది తెలుసుకునే పనిలో ఆమె అభిమానులు, నెటిజన్లు బిజీగా ఉన్నారు.

Latest Videos

click me!